ప్రధాని మోడీ .. మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు..
మోడీ వలస కార్మికులను గురించి పట్టించుకోకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితం రెండో సారి తిరిగి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోడీపై వలస కార్మికుల ఆగ్రహం గురించి బిభూదత్త ప్రధాన్. మరియు సుధి రంజన్ సేన్…. న్యూదిల్లీః ఆరేళ్ళ క్రితం నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా అధికారాన్ని చేపట్టిన తర్వాత మొదటిసారిగా వలస కార్మికులపై తనకున్న పట్టును రవిడుచుకుంటున్నారు. గడిచిన రెండు మాసాలుగా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు ఆదాయాన్ని కోల్పోతున్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి మోడీ రాత్రికి రాత్రి లాక్ డౌన్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చిన ఈ లాక్ డౌన్ వల్ల అన్ని వర్గాల వారూ పనులను కోల్పోయారు.మోడీ మనలను ఎందుకు పట్టించుకోవడం లేదు… జౌళి ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికుడు జమ్మున్ ఝా ప్రశ్నించారు. నోడియాకు ఉత్తరాన ఉన్న ఫ్యాక్టరీ 50 ఏళ్ళ కార్మికుడు ప్రశ్నించారు. లాక్ డౌన్ వల్ల అతడు ఉపాధి కోల్పోయాడు బీహార్ ఉత్తర ప్రాంతానికి చెందిన అతడు ఈ ఫ్యాక్టరీలో ఉద్యోగం కోసం 1200 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాడు. తిరిగి వెళ్ళేందుకు మే 29వ తేదీన బస్సు కోసం వేచి ఉన్నాడు. మోడీ ఈసారి మా కోసం చేసిందేమి లేదు అని అన్నాడు.అతడు గత ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి ఓటు వేసిన ట్టు చెప్పాడు. కిందటి సారి మోడీకి ఓటు వేసిన వారమంతా వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలో ఆలోచించుకోవల్సిందేనని అతడు అన్నాడు మోడీ పట్ల జనాభిప్రాయానికి ప్రత్యేకంగా సర్వేలు అవసరం లేదు. దేశంలో వంద మిలియన్ ల వలస కార్మికులు ఉన్నారు. కరోనా వచ్చినప్పటి నుంచి ఆయన తీసుకుంటున్న చర్యలకు అధిక సంఖ్యాకుల ఆమోదం ఉంది. పార్లమెంటులో అత్యధిక మెజారిటీ కలిగి ఉన్న ఆయనకు అందరి మద్దతు ఉంది. ప్రతి పక్షం బలహీనంగా ఉంది. 2024 సాధారణ ఎన్నికల వరకూ ఆయనకు తిరుగులేదు.కానీ ఝా వంటి వలస కార్మికులు వేస్తున్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాలి. ముఖ్యంగా, త్వరలో బీహార్ శాసనసభకు ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలతో రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్ డిఏ బలంపై ప్రభావం పడనుంది. నవంబర్ లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
దేశంలో వలస కార్మికులకు బీహార్ పుట్టినిల్లు.ఎక్కువ మంది వలస కార్మికులు బీహార్ నుంచే ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. బీహార్ లో ప్రస్తుతం జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. దేశంలో అతి పేద రాష్ట్రం, త్యధిక జనాభా గల రాష్ట్రం. అయితే, రాష్ట్ర ప్రజల్లో వ్యక్తం అవుతున్న వ్యతిరేత మోడీ పార్టీపై ప్రభావం చూపుతుందనడం తొందరపాటే నని దక్షిణాసియా రాజకీయ విశ్లేషకుడు అనిల్ బేరీ ఈ మెయిల్ ద్వారా తన అభిప్రాయం తెలిపారు. అయితే, రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏకతాటిపై నిలిస్తే పరిస్థితి వేరుగా ఉండవచ్చు. బీజేపీ సీనియర్ న్యాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గత ఆదివారం ఎన్నికల ప్రచారంప్రారంభించారు. మోడీ నేతృత్వంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమాగా చెప్పారు. ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలను పట్టించుకోవద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు వలస కార్మికుల గురించి మాట్లాడుతున్న విషయాలకు దూరంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వలస కార్మికులు దేశంలోని శ్రామిక శక్తిలో ఐదింట ఒక వంతు మంది ఉంటారు. అయితే, వలస కార్మికులు వందల మైళ్ళు కాలినడకన, సైకిళ్ళపైనా ప్రయాణం చేసి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. బీహార్ కు చెందిన వలస కార్మికులు స్వస్థలాలకు చేరేందుకు నానా అవస్థలు పడుతున్నారు. మధ్యలో ప్రమాదాలకు గురి అవుతున్నారు. తిండి లేక దూర ప్రాంతాలకు వెళ్ళలేక చాలా అవస్థలు పడుతున్నారు వలస కార్మికులు మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఇప్పటికీ చేస్తున్నారు. వీరంతా వచ్చే ఎన్నికల్లో మోడీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని షాబాల్ గుప్తా అనే ఆర్థిక శాస్త్రవేత్త అన్నారు. ఆయన బీహార్ లో ఆసియా అభివృద్ది, పరిశోనాధనా సంస్థ వ్యవస్థాపకుడు. వలస కార్మికులు గతంలో మోడీని గురించి గొప్పగా మాట్లాడే వారు ఇప్పుడు వారంతా తీవ్రంగా విమర్శిస్తున్నారు. వలస కార్మికులకు రైళ్ళను ఏర్పాటు చేయాలనీ, స్వస్థలాలకు చేరేదాకా వారికి సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లాక్ డౌ న్ పొడిగిస్తే తిరిగి వచ్చేయాలని వలస కార్మికులు భావిస్తున్నారని షానవాజ్ హుస్సేన్ అన్నారు.వలస కార్మికుల పోరాట ఫలితంగానే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ వచ్చింది. కిషన్ కుమార్ శర్మ అనే యువ కార్మికునికి ప్రమాదం వల్ల నడుం విరిగి పోయింది ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు ఢిల్లీ హాస్పిటల్ లో సౌకర్యాలు సక్రమంగా లేవనీ, పశువులను కూడా ఇంత కన్నా బాగా చూస్తారని అతడు అన్నాడు అతడు చక్రాల కుర్చీలో 800 కిలో మీటర్ల దూరంలోని ఉత్తరప్రదేశ్ లోని స్వస్థలానికి బయలు దేరాడు మోడీ ప్రభుత్వం ఎన్నెన్నో చెబుతోంది.కానీ చేసిందేమీ లేదని అతడు అన్నాడు కిందటి సారి బీజేపీకి ఓటు వేశాను. వచ్చే సారి వేయను అన్నాడు.