Take a fresh look at your lifestyle.

కొరోనా కట్టడికి కలసికట్టుగా కృషిచేసేందుకు 24 గంటలూ.. అందుబాటులో ఉంటా

  • తాజా పరిస్థితులు..వైరస్‌ ‌నియంత్రణ చర్యలపై ఆరా
  • తమకు నిధులిచ్చి ఆదుకోవాలన్న కాంగ్రెస్‌ ‌పాలిత సిఎంలు
  • లాక్‌డౌన్‌ను  పొడిగించాలన్న పలువురు ముఖ్యమంత్రులు
  • మాస్కు ధరించిన ప్రధాని..పలువురు సిఎంలు
  • రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్

కొరోనా కట్టడి పోరులో భాగంగా ఆయారాష్టాల్రు తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూనే, వారికి తాను 24గంటలు అందుబాటులో ఉంటానని ప్రధాని మోడీ అభయమిచ్చారు. ఎప్పుడైనా తనతో సంప్రదించవచ్చని అన్నారు. అలాగే ఇంతకాలం లాక్‌డౌన్‌తో ఆయారాష్ట్రాలు తీసుకున్న చర్యలు..వాటి ఫలితాలను కూడా ఆరా తీసారు. పలువురు ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ను పొడించాలని, లేకుంటా ఈ 21 రోజులు పడ్డ కష్టం వృధా అవుతుందన్నారు. అలాగే తాను అందరికీ అందుబాటులో ఉంటానని ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ హా ఇచ్చారు. ఎవరైనా, ఎప్పుడైనా తనకు ఫోన్‌ ‌చేసి సలహాలు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. అందరు కలిసి పనిచేస్తేనే ఈ మహమ్మారిని తరిమికొట్టగలమని పిలుపునిచ్చారు. రాష్టాల్లో్ర కొవిడ్‌-19 ‌పరిస్థితులు, మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ ‌పొడిగింపుపై అభిప్రాయాలే లక్ష్యంగా శనివారం ప్రధాని అన్ని రాష్టాల్రముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. తొలుత కేంద్ర ఆరోగ్యశాఖ దేశంలో తాజా పరిస్థితులను సభ్యులకు వివరించింది. అనంతరం ఒక్కో ముఖ్యమంత్రి తమ అభిప్రాయాల్ని ప్రధాని మోడీతో పంచుకున్నారు.

చాలా మంది సీఎంలు లాక్‌డౌన్‌ ‌పొడిగించాలని సూచించినట్లు సమాచారం. ఇప్పటికే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ ‌పట్నాయక్‌, ‌పంజాబ్‌ ‌సీఎం అమరేందర్‌ ‌సింగ్‌ ‌లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30 ‌వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించేశారు. మరోవైపు కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించాలని నిర్ణయిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బిహార్‌ ‌ప్రభుత్వం లేఖ రాసింది. అయితే గ్రాణప్రాంతాల్లో దినసరికూలీలకు మాత్రం మినహాయింపు ఇవ్వాలని కోరింది. ఇప్పుడు అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ ఏ‌ప్రిల్‌ 14‌తో ముగియనున్న విషయం తెలిసిందే.లాక్‌డౌన్‌ ‌విధించిన తర్వాత సీఎంలతో ప్రధాని సక్ష నిర్వహించడం ఇది రెండోసారి. ఏప్రిల్‌ 2‌న జరిగిన కాన్ఫరెన్స్‌లో 14వ తేదీ తర్వాత తీసుకోవాల్సిన చర్యలను ప్రస్తావించారు. సాధారణ పరిస్థితుల్ని పూర్తిగా పునరుద్ధరించడం కుదరదని అప్పుడే స్పష్టం చేశారు. దశలవారీగా ఆంక్షల సడలింపు ఉంటుందని సంకేతాలిచ్చారు. తాజాగా పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ ‌కొనసాగాలని రాష్టాల్ర నుంచి డిమాండ్‌ ‌వచ్చిన విషయం తెలిసిందే. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను పొడిగించాలని ఇప్పటికే పలు రాష్టాల్రు ప్రధాని మోదీని కోరాయి. ముఖ్యమంత్రులతో సక్ష అనంతరం లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు లాక్‌డౌన్‌తో రాష్టాల్ర ఆర్థిక పరిస్థితులు దిగజారాయని, రాష్టాల్రకు నిధులను విడుదల చేయాలని కాంగ్రెస్‌ ‌పాలిత రాష్టాల్ర ముఖ్యమంత్రలు ప్రధాన మంత్రి నరేంద్రమోడీని డిమాండ్‌ ‌చేసినట్లు తెలుస్తోంది. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ ఏ‌ప్రిల్‌ 14‌న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను పొడిగించాలా.. వద్దా..? అన్న దానిపై ప్రధాని నేరంద్ర మోడీ శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించివారి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ మేరకు ఏప్రిల్‌ 14 ‌తర్వాత లాక్‌డౌన్‌ ‌పొడిగింపు, తదితర అంశాలపై కీలక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

- Advertisement -

కరోనా వైరస్‌కట్టడికి కేంద్రం నుంచి నిత్యం సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రులు కోరినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. లాక్‌డౌన్‌పై మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని దేశ ప్రజలందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 7447కు చేరుకుంది. ఇక మరణాల సంఖ్య 239కు చేరుకుంది. అయితే..24 గంటల్లో 1035 పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా.. 40 మంది మృతి మృతి చెందారు. ఆస్పత్రుల్లో 6656 మంది చికిత్స పొందుతున్నారు. 643మంది కోలుకున్నారు. అయితే.. ముందుముందు ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. దేశంలో మొత్తం 720 జిల్లాలు ఉన్నా.. దాదాపుగా 400 జిల్లాలో కరోనా వైరస్‌‌ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఇదే సమయంలో దేశంలోని 133 జిల్లాల్లో కరోనా వైరస్‌ ‌ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో మోడీ నిర్ణయం కోసం దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మాస్క్ ‌ధరించిన ప్రధాని మోడీ:
ఇకపోతే వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ మాస్క్ ‌ధరించి పాల్గొన్నారు. సాధారణ మాస్క్ ‌కాకుండా తెల్లటి వస్త్రంతో చేసిన మాస్క్ ‌వేసుకోవడం విశేషం. అలాగే పలువురు ముఖ్యమంత్రులు సైతం మాస్క్ ‌ధరించారు. ఇంట్లో తయారు చేసిన రెండు పొరలతో కూడిన మాస్క్‌ను ధరించొచ్చని గత వారం కేంద్రం సూచించిన విషయం తెలిసిందే. దానిపై ప్రజల్లో అవగాహన కల్పించేలా నేడు మోదీ మాస్క్‌ను ధరించి నట్లు తెలుస్తోంది. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని కేంద్రం, రాష్టాల్రు హెచ్చరిస్తున్న విషయం విదితమే. విధిగా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ఆయా ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అన్ని రాష్టాల్ర సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ‌సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాస్కు ధరించి దాని ఆవశ్యకతను పరోక్షంగా వివరించారు. దాదాపు ముఖ్యమంత్రులందరూ కూడా మాస్కులు ధరించి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. తెలంగాణ సిఎం కెఐసిఆర్‌, ‌బీహార్‌ ‌సిఎం నితీశ్‌ ‌కుమార్‌, ‌ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply