న్యూ దిల్లీ, డిసెంబర్ 15 : సర్దార్ వల్లబ్ బాయ్ పటేల్ వర్థంతి సందర్భంగా గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రధాని భారతదేశానికి సర్దార్ పటేల్ అందించిన చిరస్థాయిగా నిలచిపోయే తోడ్పాటును ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొన్నారు. ప్రధాన మంత్రి ఈ సందర్భంగా చేసిన ఒక ట్వీట్‌లో..‘‘శ్రీ సర్ దార్ పటేల్ వర్థంతి సందర్భంలో ఆయనకు నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
భారతదేశానికి ఆయన అందించినటువంటి చిరస్థాయిలో నిలచిపోయే తోడ్పాటును, ప్రత్యేకించి మన దేశాన్ని ఏకం చేయడంలో, అలాగే మన దేశం యొక్క సర్వతోముఖ అభివృద్ధికి ఉత్తేజాన్ని ఇవ్వడంలో ఆయన తోడ్పాటును స్మరించుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.