Take a fresh look at your lifestyle.

దేశంలో అభివృద్ధి వేగం పెరిగింది

ఇకపై మందగించదు
కొచ్చి-మంగళూరు నేచురల్‌ ‌గ్యాస్‌ ‌పైప్‌లైన్‌కు వీడియో కాన్ఫరెన్సింగ్‌ ‌ద్వారా ప్రారంభించిన ప్రధాని మోడీ

మన దేశం అభివృద్ధి వేగాన్ని పెంచిందని, ఇక ఎంత మాత్రం ఈ వేగం మందగించబోదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కొచ్చి-మంగళూరు నేచురల్‌ ‌గ్యాస్‌ ‌పైప్‌లైన్‌ను మంగళవారం వీడియో కాన్ఫరెన్సింగ్‌ ‌ద్వారా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇటీవలి సంవత్సరాల్లో మన దేశం అభివృద్ధి వేగం, విస్తృతి, పరిధులను పెంచిందన్నారు. గత దశాబ్దాల్లో భారత దేశ ప్రగతి వేగం వెనుక గల కారణాల గురించి తాను మాట్లాడబోనని తెలిపారు. కొచ్చి-మంగళూరు పైప్‌లైన్‌ ‌ద్వారా మంగళూరు కెమికల్స్ అం‌డ్‌ ‌ఫెర్టిలైజర్స్ ‌ప్లాంట్‌కు ఇంధనం అందుతుందన్నారు. మంగళూరు రిఫైనైరీ అండ్‌ ‌పెట్రోకెమికల్‌ ‌ప్లాంట్‌కు శుద్ధ ఇంధనాన్ని సరఫరా చేస్తుందన్నారు. సీఎన్‌జీ స్టేషన్లను 10 వేలకు పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.

- Advertisement -

2014 వరకు కేవలం 25 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లు మాత్రమే ఉండేవని, నేడు 72 లక్షలకు పైగా కనెక్షన్లు ఉన్నాయని చెప్పారు. కొచ్చి-మంగళూరు పైప్‌లైన్‌ ‌వల్ల కేరళ, బెంగళూరుల్లో కాలుష్యం తగ్గుతుందన్నారు. మెరుగైన వాతావరణం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. కాలుష్యం తక్కువగా ఉంటే, నగరాలకు గ్యాస్‌ ఆధారిత సేవలు అందుబాటులోకి వొస్తే, పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. సహజ వాయువును ఉపయోగించడం వల్ల అనేక పర్యావరణ సంబంధిత ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. భారత దేశ ఎనర్జీ బాస్కెట్‌లో సహజ వాయువు వాటాను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచేందుకు తగిన విధానాలను ప్రభుత్వం రూపొందిస్తోందని చెప్పారు. చమురు, సహజ వాయువు రంగంలో ఈ దశాబ్దంలోనే కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెడతామన్నారు. ఉజ్వల యోజన వంటి పథకాల ద్వారా వంట గ్యాస్‌ ‌దాదాపు ఎనిమిది కోట్ల కుటుంబాలకు చేరుతోందన్నారు. ఎల్‌పీజీ సంబంధిత మౌలిక సదుపాయాలు పటిష్టమైనట్లు తెలిపారు. ఇదిలావుంటే ఒకేదేశం ఒకే గ్రిడ్‌’ ‌లక్ష్యం దిశగా గెయిల్‌ ఇడియా లిమిటెడ్‌ ‌నిర్మించిన 450 కిలోవి•టర్ల కొచ్చి-మంగళూరు నేచురల్‌ ‌గ్యాస్‌ ‌ప్రాజెక్టు కీలకమైన మైలురాయి అవుతుందని పీఎంఓ కార్యాలయం మంగళవారం ఉదయం ఒక ప్రకటనలో తెలిపింది. రూ.3000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు ఎర్నాకులం, త్రిసూరు, పాలక్కాడ్‌, ‌మలప్పురం, కోజికోడ్‌, ‌కన్నూరు, కాసర్‌గాడ్‌ ‌జిల్లాలను అనుసంధానిస్తుంది.

Leave a Reply