Take a fresh look at your lifestyle.

ఉత్తరాఖండ్‌ అభివృద్ధికి లక్ష కోట్లు

గత ప్రభుత్వాలు కొండ ప్రాంతాలను విస్మరించాయి
కొత్త కారిడార్‌తో ఢిల్లీ-డెహ్రాడూన్‌ల మధ్య సగం దూరం తగ్గుదల
ఢిల్లీ-డెహ్రాడూన్‌ ఎకనామిక్‌ ‌కారిడార్‌కు శంకుస్థాపనలో ప్రధాని
గత ఐదేళ్లలో ఉత్తరాఖండ్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. కేంద్రం కేటాయించిన అభివృద్ధి ప్రాజెక్టులలో రూ.18,000 కోట్లకు పైగా కార్యక్రమాలను ఈ రోజు ప్రారంభించినట్లు ప్రధాని వెల్లడించారు. దేశమంతటా.. ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం..100లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దీనిలో భాగంగా శనివారం ఢిల్లీ-డెహ్రాడూన్‌ ఎకనామిక్‌ ‌కారిడార్‌కు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. ఢిల్లీ-డెహ్రాడూన్‌ ఎకనామిక్‌ ‌కారిడార్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారంనాడిక్కడ శంకుస్థాపన చేశారు. రూ.8,300 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. దీనితో పాటు రూ18,000 కోట్లతో ఉత్తరాఖండ్‌లో ఏర్పాటు చేయనున్న వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ, గత ఐదేళ్లలో ఉత్తరాఖండ్‌ అభివృద్ధికి కేంద్రం లక్ష కోట్లకు పైగా ఆమోదం తెలిపిందని చెప్పారు. ఢిల్లీ-డెహ్రాడూన్‌ ఎకనామిక్‌ ‌కారిడార్‌కు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ కారిడార్‌ ‌సిద్ధమైన తర్వాత ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు ప్రయాణించే సమయం సగానికి సగం తగ్గుతుందని చెప్పారు. కొండ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలపై గత ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయలేదంటూ ప్రధాని మోదీ కాంగ్రెస్‌ను విమర్శించారు. అన్ని ప్రాంతాలను నిరుత్సాహపరిచారని, ముఖ్యంగా సైన్యాన్ని కూడా విస్మరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఒక ర్యాంక్‌, ఒకే పెన్షన్‌ ‌విధానాలను అమలు చేశామన్నారు. సైన్యానికి ఆధునిక ఆయుధాలను అందించామని.. ఉగ్రవాదులకు తగిన సమాధానం ఇచ్చామమని ప్రధాని తెలిపారు. మన పర్వతాలు, సంస్కృతి మన విశ్వాసం మాత్రమే కాదు మన దేశ భద్రతకు కోటలు కూడా అని ప్రధాని పేర్కొన్నారు. పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన సౌలభ్యానికి తాము ప్రాధాన్యత నిస్తామని స్పష్టంచేశారు. అయితే.. దురదృష్టవశాత్తు దశాబ్దాలుగా అధికారంలో కొనసాగిన వారు.. ఈ విధాన వ్యూహాన్ని అవలంభించలేదంటూ ఆగ్రహించారు. 2007- 2014 మధ్య కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో రూ. 600 కోట్ల విలువైన 288 కిలోవి•టర్ల జాతీయ రహదారులను మాత్రమే నిర్మించిందని ప్రధాని గుర్తు చేశారు.

అయితే తమ ప్రభుత్వం 7 సంవత్సరాలలో ఉత్తరాఖండ్‌లో రూ.12,000 కోట్ల విలువైన 2,000 కిలోవి•టర్ల కంటే ఎక్కువ జాతీయ రహదారులను నిర్మించిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పర్వత ప్రాంతాల్లో నివసించే వారు సులభంగా జీవనయానం సాగించేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న వారు ఇందుకు సంబంధించి ఎలాంటి విధానపరమైన వ్యూహం రూపొందించడపోవడం దురదృష్టకరమని అన్నారు. 2007 నుంచి 2014 మధ్య కాలంలో ఉత్తరాఖండ్‌లో రూ.600 కోట్లతో కేవలం 288 కిలోవి•టర్ల నేషనల్‌ ‌హైవేల నిర్మాణం జరుపగా, తమ ప్రభుత్వం 7 ఏళ్ల పాలనలో ఉత్తరాఖండ్‌లో రూ .12,000 కోట్లతో 2,000 కిలోవి•టర్లకు పైగా జాతీయ రహదారుల నిర్మాణం జరిపిందని ప్రధాని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర సిఎం, మంత్రులు పాల్గొన్నారు.

Leave a Reply