Take a fresh look at your lifestyle.

పీఎం కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి. లబ్ధిదారుల జాబితా నుంచి.. 33 లక్షల పేర్లు తొలగింపు

2019లో రై తుల కోసం  కేంద్ర ప్రభుత్వం తీసుకొ చ్చిన పీఎం కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి పథ కం ద్వారా అర్హత కలిగిన ప్రతి రైతుకు మూడు విడతల్లో రూ.2వేలు చొప్పున ఏడాదికి రూ.6 వేలను బ్యాంక్‌ ‌ఖాతాల్లో జమ చేస్తున్న విషమం తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుల జాబితా నుంచి 33 లక్షల రైతుల పేర్లను తొలగించింది. వీరంతా అర్హత లేకున్నా పీఎం కిసాన్‌ ‌నగదును పొందుతున్నట్లు కేంద్రం గుర్తించింది. అందుకే వీరి పేర్లను పీఎం కిసాన్‌ అర్హుల జాబితా నుంచి తొలగించింది.

సుమారు 2,327 కోట్ల రూపాయలను అనర్హులైన రైతుల నుంచి తిరిగి  వసూలు చేసినట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పంజాబ్‌, ‌రాజస్థాన్‌, ‌బీహార్‌, ‌జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌మహారాష్ట్ర సహా మొత్తం 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రికవరీ పక్రియ ప్రారంభమైంది. మిగిలిన రాష్ట్రాల్లో కూడా అనర్హులైన రైతుల నుంచి రికవరీని త్వరలో ప్రారంభించవొచ్చు. పీఎం కిసాన్‌ ‌వెరిఫికేషన్‌ ‌పక్రియ సమయంలో 32,91,152 మంది భోగస్‌ ‌లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు.

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌కు జత చేసిన ఆధార్‌, ‌పాన్‌ ‌నంబర్లను తనిఖీ చేసే సమయంలో కొన్ని లక్షల మంది రైతులు ఆదాయపు పన్నును చెల్లిస్తున్నారని గుర్తించింది. అలాగే ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగాలు, పెన్షనర్లు కూడా ఈ ప్రయోజనాలు పొందుతున్నట్లు గుర్తించింది. అనర్హుల జాబితాలో ఎక్కువ శాతం మంది తమిళనాడులో(6.96 లక్షల) ఉన్నారు. ఇక పంజాబ్‌ ‌లో 4.70 లక్షల మంది, కర్ణాటకలో 2.04 లక్షల మంది, ఉత్తరప్రదేశ్‌ ‌లో 1.78 లక్షలు మంది, రాజస్థాన్‌ ‌లో 1.32 లక్షల మంది, హర్యానాలో 35 వేల మంది, గుజరాత్‌లో ఏడు వేలకు పైగా బోగస్‌ ‌లబ్ధిదారులు ఉన్నారు.

Leave a Reply