జీవో 131పై సర్వత్రా వ్యతిరేకత
డబ్బులు కడితే సక్రమం.. లేదంటే అక్రమమా? పథకంపై నిరసనలు
హుడా(హెచ్ఎండీఏ), డీటీసీపీ అప్రూవ్ కాని ప్లాట్లన్నీ అక్రమమంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు సమాయత్తమయ్యింది. ఎల్ఆర్ఎస్కు గతంలో ఉన్న విధ•ంగా కాకుండా అనేక మార్పులు తెచ్చి నగరం, పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా, మార్కెట్ విలువతో సంబంధం లేకుండా అంతటా ఒకే రేటు నిర్ణయించి డబ్బులు కట్టి రెగ్యులరైజ్ చేయించుకోండంటూ ఓ జీవో తీసుకొచ్చేసింది. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవోపై సర్వత్రా వ్యతిరేకతలు వెల్లడవుతున్నాయి. ప్రభుత్వ చర్య సామాన్యులకు, మధ్య తరగతికి చెందిన ప్లాట్ల ఓనర్లకు పెను భారంగా పరిణమించిందని •గ్రహం వెల్లగక్కుతున్నారు. ఎల్ఆర్ఎస్ పేరుతో గతంలో కొన్న ప్లాట్లన్నీ రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం ఆగమేఘాలపై జీవో 131 తీసుకువచ్చి రిజిస్ట్రేషన్లు నిలిపి•వేసింది. గతంలోని లేఅవుట్లన్నీ అక్రమమంటూ తేల్చేసి వీటికి ఎల్ఆర్ఎస్లో ద•రఖాస్తు చేసుకుని నిర్ధేశించిన రుసుములు చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలని పేర్కొంది. తాము 40, 50 ఏళ్ళ క్రితం కొన్న ప్లాట్లు కూడా అక్రమమంటూ ఎల్ఆర్ఎస్లో ద•రఖాస్తు చేసుకోవాలనడంపై ప్లాట్ల యజమానులు మండిపడుతున్నారు. ఇవి అక్రమమైతే ప్రభుత్వానికి చెందిన రిజిస్ట్రేషన్ల శాఖ ఎలా రిజిస్ట్రేషన్లు చేసిందని, సంబంధిత గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇళ్ళ నిర్మాణాలకు ఏవిధంగా అనుమతులిచ్చాయని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
స్టాంపులు, చలాన్ల రూపంలో చెల్లించిన డబ్బంతా ప్రభుత్వ ఖజానాకే చేరింది కదా మరి ఇక ఇప్పుడు అక్రమం ఏమిటీ అంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తు అవసరాల కోసమని ఎంతో ఆశతో చెమటోడ్చిన డబ్బులతో స్థలం కొంటే ఏమిటీ విడ్డూరమని పులువురు మండిపడుతున్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజుల చెల్లింపు ఎలా ఉందంటే పేరుకు నామమాత్ర ఫీజులు కానీ ప్లాట్ క్లియరెన్స్ కోసం దాదాపు సగం ప్లాటు అమ్ముకునే పరిస్థితులు తీసుకువచ్చారని ప్లాట్ల యజమానులు లబోదిబోమంటున్నారు. నామమాత్రపు ఫీజులంటే రూ.5 వేల లేదా రూ.10 వేల వరకుండాలి కానీ లక్షలు కట్టమంటే ఎక్కడి నుండి తెస్తామని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా ప్లాటుకు 20 అడుగుల రోడ్డుంటే 5 ఫీట్ల మేర స్థలము వదులుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్లాట్ల ముందు 20 ఫీట్ల రోడ్డు ఇరుకనపిస్తుంది. కానీ అదే మహానగరంలోని బస్తీల్లో కనీసం ఆటో కూడా పట్టని గల్లీలు అగుపడడం లేదా అని విమర్శిస్తున్నారు. ప్రభుత్వానికి ఖజానా నింపుకోవడం అత్యవసరమైతే ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లను నిరంతర ప్రక్రియగా మారిస్తే ఎవరికి వీలైన సమయాల్లో వాళ్ళు చేసుకుంటారని పలువురు సూచిస్తున్నారు. కానీ పలానా తేదీ నాటికి కటాఫ్ అంటూ డెడ్లైన్ విదించడం ఎంత మాత్రం సమంజసం కాదని పలువురు పేర్కొంటున్నారు. గతంలో మాదిరిగానే మార్కెట్ విలువలపై కొద్ది శాతం ఫీజుతో రెగ్యులరైజ్ చేయాలని, నిర్ణీత కాలవ్యవధి అంటూ లేకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని పలువురు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని చట్టాలు చేయాలని, మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని ప్లాట్ల యజమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
నామమాత్రపు ఫీజుతో రెగ్యులరైజ్ చేయాలి..
గతంలో హుడా (హెచ్ఎండీఏ), డీటీసీపీ• అప్రూవ్డ్ లేకుండా వెలసిన లేఅవుట్లన్నీ అక్రమమంటూ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరిట సామాన్యులపై ఈ తరహా వసూళ్ళకు తెరతీయడం ఆక్షేపనీయం. సామాన్య, మధ్య తరగతి ప్రజలు పైసాపైసా కూడబెట్టి భవిష్యత్తు అవరాల కోసం ప్లాటు కొనుక్కుంటే క్రమబద్ధీకరించుకునేందుకు లక్షల్లో ఫీజుల భారం మోపడం దారుణం. నామమాత్రపు ఫీజుతో రెగ్యులరైజ్ చేయాలి.
అనుమతులిచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలి..
గతంలో స్థానిక సంస్థలు మంజూరు చేసిన లేఅవుట్లు అక్రమమా? అయితే వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులపై ముందు చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలి. గతంలో ఒక్కో ప్లాటు 10,15 చేతులు మారాయి. వాటికి చెల్లించిన స్టాంపు డ్యూటీ, ఫీజులు వాపసు ఇవ్వాలి. ఎల్ఆర్ఎస్ నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తూ రిజిస్ట్రేషన్లు యథావిధిగా కొనసాగించాలి.