Take a fresh look at your lifestyle.

ప్లాస్టిక్‌ ‌రహిత గ్రామంగా తీర్చిదిద్దాలి జెడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి

bhodhan pochampaali, sandeep reddy, zp chairman, dhochigudemభూదాన్‌ ‌పోచంపల్లి  మండలంలోని ప్రతి  గ్రామంలో ప్లాస్టిక్‌ ‌ను పూర్తిగా నిషేధించి ప్రతి గ్రామాన్ని ప్లాస్టిక్‌ ‌రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌ ‌రెడ్డి,డిఎల్పిఓ సాధన అన్నారు. గురువారం భూదాన్‌ ‌పోచంపల్లి మండల పరిధిలోని దోతిగూడెం, దేశ్ముకి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా దోతిగూడెం గ్రామంలో చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా జమ చేసి ప్లాస్టిక్‌ ‌ను పూర్తిగా నిషేధించాలని అన్నారు..ప్రజల బాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

అనంతరం దేశ్ముకి గ్రామంలో గల సాయి బృందావనంలో ఆలయ చైర్మన్‌ ‌ఘంటా నారాయణ స్వామిజీ ఆధ్వర్యంలో డిపిఎల్వో సాధన ప్రత్యేక పూజలు నిర్వహించారు.క్షేత్రం ఆవరణలో పూల మొక్కలు, పండ్ల తోటను పెంచి నిత్య అన్నదానాన్ని నిర్వహించడం సంతోషాదాయకమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి మాడుగుల ప్రభాకర్‌ ‌రెడ్డి,జెడ్పిటిసి కోట పుష్పాలత మల్లారెడ్డి,వైస్‌ ఎం‌పిపి పాక వెంకటేష్‌ ‌యాదవ్‌, ‌ధోతిగూడెం సర్పంచ్‌ ‌పగిల్ల స్వప్న రామ్‌ ‌రెడ్డి,దేశ్ముకి సర్పంచ్‌ ‌దుర్గం స్వప్న నరేష్‌,ఎం‌పిటిసి చిల్లర జంగయ్య,ముత్యాల మహిపాల్‌ ‌రెడ్డి,ఆర్‌ఐ ‌రాంరెడ్డి,పంచాయతీ కార్యదర్శి లక్ష్మి ప్రసన్న  పాల్గొన్నారు.

Tags: bhodhan pochampaali, sandeep reddy, zp chairman, dhochigudem

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply