Take a fresh look at your lifestyle.

ప్లాస్టిక్‌ ‌కవర్లు, కాలం చెల్లిన వస్తువులు అమ్ముతున్న వారికి…రూ.12వేల జరిమానా

జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని పలు దుకాణాలలో నిషేధిత ప్లాస్టిక్‌ ‌కవర్లు, కాలం చెల్లిన వస్తువులను అమ్ముతున్నట్లు మునిసిపల్‌ అధికారులు, సిబ్బంది తనిఖీల్లో తేలింది. మునిసిపల్‌ ‌ఛైర్మన్‌ ‌కడవేర్గు రాజనర్సు, కమిషనర్‌ ‌శ్రీనివాస్‌ ‌రెడ్డి ఆదేశాలతో…పట్టణంలోని గాంధీ రోడ్డు, లాల్‌ ‌కమాన్‌, ‌మార్కెట్‌ ఎక్స్ ‌రోడ్డు, సుభాష్‌ ‌రోడ్డు తదితర ప్రాంతాలలో గల కిరాణ దుకాణాలలో తనిఖీలు చేయగా పెద్దయెత్తున ప్లాస్టిక్‌ ‌కవర్లతో పాటు కాలం చెల్లిన వస్తువులు అమ్ముతున్నట్లు బయటపడిందన్నారు. అదే విధంగా  స్వీట్‌ ‌హౌస్‌ ‌చికెన్‌ ‌సెంటర్‌పై కూడా దాడి చేశారు.  ఈ దుకాణాలను సీజ్‌ ‌చేయడంతో పాటు 12వేల రూపాయల జరిమానా విధించారు. ఈ తనిఖీలలో మున్సిపల్‌ అధికారులు డాక్టర్‌ ‌శాంతి కుమారిలి, ఎస్‌. ఐల•్య, బాలకృష్ణ, సతీష్‌, ‌బిల్‌ ‌కలెక్టర్‌ ‌రాజు, మల్లేశం, రామకృష్ణ, నర్సింలు, చంద్రశేఖర్‌, ‌నరేష్‌, ‌రాజేశ్వ•,• సీను, రాములు, గణేష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply