Take a fresh look at your lifestyle.

ప్లాస్మా థెరపి వల్ల మరణాలు తగ్గవు..! ఐసీఎమ్ఆర్ అధ్యయనం లో వెల్లడి

ప్లాస్మా థెరపీ వలన కోవిద్ మరణాలను తగ్గించటం సాధ్యం కాదు అని  ICMR అధ్యయనం తేల్చింది. కోవిడ్ -19 కి చికిత్సా విధానంలో భాగంగా కోవిడ్ సోకి ఆరోగ్యం కుదుట పడిన వ్యక్తి రక్తంలోని ప్లాస్మాను ఉపయోగించి కొరోనా పేసెంట్ లకు చికిత్స చేయటం అనేది భారతదేశంలో అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. ఈ విధంగా చేయమని ICMR స్వయంగా ఆదేశాలు జారీ చేసింది. ICMR, కోవిడ్ -19 కి చికిత్సాలో ప్లాస్మాను ఉపయోగించడంపై ఐసిఎంఆర్ ప్లాసిడ్ ట్రయల్ ఓ వైపు చేస్తూనే ప్లాస్మా కొరోనా చికిత్సలో నిజంగా ప్రభావం చూపుతుంది లేనిది పరిశోధన కూడా చేసింది.  ICMR చేసిన పరిశోధనలో  కోవిడ్ సోకి ఆరోగ్యం కుదుట పడిన వ్యక్తి రక్తంలోని ప్లాస్మాతో చేసే చికిత్స వలన కోవిడ్ మరణాల తగ్గింపు లేదా కోవిడ్ -19 తీవ్రత తగ్గించటం వంటివి జరగటం లేదు అని తేలింది. ఈ పరిశోధన వివరాలు మొత్తం ఆరోగ్య శాస్త్రాల ప్రిప్రింట్ సర్వర్, మెడ్‌రెక్సివ్‌లో ప్రచురించబడినది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తన అధ్యయనాన్ని సెప్టెంబర్ 8 న ప్రచురించింది. అయితే  ఈ అధ్యయనంపై మీడియా ముందు వ్యాఖ్యానించడానికి ఐసిఎంఆర్ అధికారులు సిద్ధపడటం లేదు.
గతంలో ICMR ప్లాస్మా డొనేషన్ పై వకాల్తా పుచుకుని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసింది. తీరా చుస్తే కొరోనా
పేషెంట్ కి ప్రాథమిక ప్రామాణిక సంరక్షణతో పాటు, ప్లాస్మాతో చికిత్స అందించినా అనారోగ్యంతో ఉన్న కోవిడ్ -19 రోగులలో మరణాలు లేదా తీవ్రత తగ్గటం లేదు అని పరిశోధనలో తేలింది.
కోవిడ్ సోకి ఆరోగ్యం కుదుట పడిన వ్యక్తి రక్తంలోని ప్లాస్మాను ఉపయోగించి కొత్తగా కొరోనా పేసెంట్ గా తేలిన వారికి,  ప్లాస్మా థెరపీ అందిస్తే కొరోనా మహమ్మారి నుంచి కోలుకోవడానికి ఆస్కారం వుంది అని ICMR చెప్పటంతో కోవిడ్ -19 నుండి కోలుకున్న వ్యక్తులు ప్లాస్మా దానం చేసేవారు.  అలాగే కొరోనా సోకినా వ్యక్తి బంధువులు ప్లాస్మా దానం చేసేవారికి కోసం వెతికే వారు.. ఇప్పుడు ప్లాస్మా వలన ఉపయోగం లేదు అని తేలటం నిరాశాజనక విషయం అయ్యింది. ఈ మొత్తం వ్యవహారం వలన  మరో సారి ICMR పనితీరు తేటతెల్లం అయ్యింది.

Leave a Reply