Take a fresh look at your lifestyle.

రహదారికి ఇరువైపుల మొక్కలు నాటాలి : కలెక్టర్‌

వనపర్తి, జూలై 09 (ప్రజాతంత్ర విలేకరి) : హరితహారంలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని ఏకో పార్కు వెనక భాగంలో ఫారెస్టు అడవి ప్రాంతంలో జిల్లా కలెక్టర్‌ ‌షేక్‌యాస్మిన్‌ ‌బాష హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు. అలాగే వనపర్తి గోపాల్‌పేట రహదారికి ఇరుపక్కల రెండు వరసల మొక్కలు నాటాలని కలెక్టర్‌ ఆదేశించారు. కొన్ని చోట్ల మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉందని అందువల్ల దూరం ఎక్కువగా ఉన్న చోట మరో మొక్కను నాటాలని మున్సిపల్‌ ‌కమీషనర్‌ను ఆదేశించారు.
రహదారి వెడల్పు 100 ఫీట్లు ఉన్నందున చివరి వరకు మొక్కలు నాటాలని కోరారు. ఫారెస్టు అడవుల్లో నాటిన మొక్కలను సంరక్షించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

error: Content is protected !!