Take a fresh look at your lifestyle.

మొక్కలు నాటడం అలవాటుగా మార్చుకోవాలి

మొక్కలు మానవ జీవన ప్రాణాధారమని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం అలవాటుగా మార్చుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ ‌గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు అన్నారు 6వ విడత హరితహారం లో భాగంగా జిల్లా లోని తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలోని కపిల్‌ ‌హోమ్స్ ‌లో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ‌విపి గౌతమ్‌ ‌తో కలిసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం అలవాటుగా మార్చుకోవాలి అని అలాగే నాటిన మొక్కను బ్రతికే విధంగా తగిన సంరక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా కోరారు ట్రీ గార్డస్ ఏర్పాటు చేయాలని అందుకు గ్రామపం చాయతీ నిధులు సరిపోకపోతే దాతల సహాయాన్నిను కోరాలన్నారు అటవీ ప్రాంతాల్లో మంకీ ఫుడ్‌ ‌కోర్టులు ఏర్పాటు ఏర్పాటు చేయడం జరుగుతు న్నదని ఆ ప్రాంతాల్లో కేవలం అటవి ఫలాలని ఇచ్చే చెట్లను మాత్ర మే నాటింప జేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.తెలంగాణ తరహాలో మొక్కలు నాటే కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదని సీఎం కేసిఆర్‌. ‌సాహసంతో వాతావరణ సమతుల్యాన్న కాపాడుకునేందుకు మొక్కలు నాటుతున్నామన్నారు.

మొక్కలు జీవావరణాన్ని పెంపొందిస్తాయని తెలియ జేసారు. ప్రజలంతా మొక్కలు నాటాలి. వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు.అధికారులు లక్ష్యలకానుగునంగా పని చేయాలన్నా రు. నిర్లక్ష్యం వహించే అధికారులు, ప్రజాప్రతినిధులు మీద చర్యలు తప్పవని హెచ్చరించారు . కొరోనా నేపథ్యంలో .ప్రజలు స్వీయ నియంత్రణతో ఉండాలని వైరస్‌ ‌ని అరికట్టడం, చికిత్స చేయడంలో డాక్టర్ల పాత్ర కీలకమైనదన్నారు.డాక్టర్లు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మన ప్రాణాలు కాపాడుతున్నారని తెలిపారు. అందుచేత డాక్టర్లకు పిపి ఈ కిట్లు అవసరమని భావించి పంపిణీ చేయడం జరుగుతున్నదన్నారు.ఈ కార్యక్ర మంలో ఆర్డీవో ఈశ్వరయ్య డి ఎఫ్‌ ఓ ‌కృష్ణమాచారి డి ఎ పి డి విద్యా చందన జడ్పీ సీఈవో సన్యాసయ్య, డిపిఓ రంగాచారి మడుపల్లి సర్పంచ్‌ ‌వేల్పుల అంజలి పంచాయతీ అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply