ప్రతి గ్రామం హరితవనాలను తలపించాలి : మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్, జులై 07(ప్రజాతంత్ర ప్రతినిథి) : భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే తప్పకుండా మొక్కలు నాటాలని మెదక్ ఎమ్మెలేయ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం హవేళిఘణపూర్ మండలంలోని బూర్గుపల్లిలో మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డితో కలసి ఆమె మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం చెట్టు లేకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులను గుర్తించి భావితరాలకు మంచి భవిష్యత్తును అందించాలంటే మొక్కలు నాటాలని అన్నారు. ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అందుకనుగుణంగా సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పనిచేయాలన్నారు. గ్రామానికి ఒక నర్సరీని ఏర్పాటు చేసి గ్రామస్థులలకు అవసరమైన మొక్కలను అందజేయడం జరుగుతుందని వివరించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటాలని వాటిని సంరక్షించాలని అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని డ్వాక్రా మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు. ప్రభత్వుం కరోనా వ్యాధిగ్రస్థుల పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. కరోనా (కోవిద్-19)లో భాగంగా అందరూ మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
– కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. భావితరాలకు కూడా మంచి వాతావరణాన్ని అందించాలనే ముందు చూపుతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. చెట్టు లేకుంటే వాతావరణం కాలుష్యంతో అనారోగ్యం పాలౌతరన్నారు. గ్రామాల్లో వీలైనంత వరకు ఎక్కువ మొక్కలను నాటి సంరక్షించాలని కలెక్టర్ కోరారు. హరితహారం విషయంలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్‌పర్సన్ లావణ్యరెడ్డి, హవేళిఘణపూర్ జడ్పీటీసీ సుజాత, జడ్పీసీఈవో లక్ష్మీబాయి, డీఆర్డీవో శ్రీనివాస్, తహశీల్దార్ వెంకటేశం, ఎంపీడీవో సాయిబాబా, ఎంపీవో ప్రవీణ్‌కుమార్, ఏవో రాజ్‌కుమార్, మధుమోహన్, సర్పంచ్‌లు చెన్నాగౌడ్, యామిరెడ్డి, సరిత, భాగ్యలక్ష్మీ, ఎంపీటీసీ అర్చన, తదితరులు పాల్గొన్నారు.