Take a fresh look at your lifestyle.

డిమాండ్‌ ఉన్న పంటలే వేయాలి : మంత్రి

సూర్యాపేట(హుజూర్‌నగర్‌), ‌మే 30, ప్రజాతంత్ర ప్రతినిధి):డిమాండ్‌ ఉన్న పంటలనే సాగు చేసేలా రైతాంగాన్ని సన్నద్దం చెయ్యాలని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌ ‌రెడ్డి వ్యవసాయ శాఖాధికారులకు ఉద్బోధించారు. అందుకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేం దుకు అధికారులు, రైతు బంధు సభ్యులు సన్నద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు జరుప తలపెట్టిన నియంత్రితసాగు విధానంపై కోదాడ, హుజూర్‌నగర్‌, ‌మిర్యాలగూడలలో జరిగిన డివిజన్‌ ‌స్థాయి అవగాహన సదస్సుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రణాళిక రూపం వల్లనే తాను పండించిన పంట కు రైతు ధర నిర్ణయించుకోలేక పోవడం నిజంగా రైతంగం దురదృష్ణకరమన్నారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండేదుకే రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్‌ ‌నియంత్రిత సాగు విధానానికి శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు. అందులో భాగమే నీటి సౌలభ్యత ఉన్నచోట ఆయిల్‌ ‌ఫామ్‌ ‌వంటి సాగును ప్రోత్సాహించడం ద్వారా రైతాం గాన్ని ఆర్థికంగా పరిపుష్టం చెయ్యవొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ప్రత్తి పంటలో అంతర్‌ ‌పంటగా కంది పంటను, కంది ప్రాధన్యత పంటగా వేసినప్పుడు పెసరను అంతర్‌ ‌పంటగా వేస్తే రైతుకు లాబాధాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌పి ఆయనకట్టు ప్రాంతంలో సన్నాలు వెయడం ద్వారా కలిగే ప్రయోజనాలను అధికారులు రైతులకు వివరించాలని సూచించా రు.

అదే సమయంలో కొత్తగా ఎస్సారెస్పీ పారుతున్న ప్రాంతాల్లో ప్రత్తి, కందిని ప్రోత్సాహిం చడం ద్వారా వచ్చ ఆర్థిక లాభాలను రైతులకు వివరించాలని కోరారు. అలాగే రైతులు తాము సాగు చేస్తున్న పంట యొక్క వివరాలను వ్యవసా య విస్తరణ అధికారి ఆన్‌లైన్‌ ‌పోర్టల్‌లో నమోదు చేసుకోవడం తప్పనిసరి అని రైతులకు, అధికారు లకు గుర్తుచేశారు. అదే విధంగా హుజూర్‌నగర్‌ ‌డివిజన్‌ ‌పరిధిలో 65044మంది రైతుల ఖాతాల్లో 79,75,40, 933రూపాయలు జమ అయ్యాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్‌, ‌డిసిసిబి చైర్మన్‌ ‌గొంగటి మహేందర్‌ ‌రెడ్డి, కోదాడ, హుజూ ర్‌నగర్‌, ‌మిర్యాలగూడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్‌, ‌శానంపూడి సైదిరెడ్డి, రైతు బంధు జిల్లా అధ్యక్షులు ఎస్‌ఏ ‌రజాక్‌, ‌భాస్కర రావు, సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డి, వ్యవసాయ శాఖాధికారి జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy