Take a fresh look at your lifestyle.

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

సూర్యాపేట, జూన్‌ 26, ‌ప్రజాతంత్ర ప్రతి నిధి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన తెలం గాణకు హరితహారం కార్యక్రమంలో భాగం గా శుక్రవారం జిల్లా కేం ద్రంలోని 22వ వార్డు లో మున్సిపల్‌ ‌వైస్‌ ‌చైర్మ న్‌ ‌పుట్టా కిషోర్‌కుమార్‌ ‌మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు వాతావర •ణ సమతుల్యత కోసం చెట్లు నాటాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. భవిష్యత్తు తరాలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా కొనసాగిస్తున్నారని కొనియాడారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో అడవుల శాతం 3మాత్రమే ఉన్నాయని, దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేస్తూ జిల్లా ప్రజలను హరితహారం భాగస్వామ్యులను చేస్తున్నారని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటికి సంరక్షిచాలని, 22వార్డులో అత్యధిక చెట్లను నాటి పట్టణంలో అగ్రభాగాన నిలపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిగ సత్యం, అశోక్‌, ఉపేందర్‌, అరుణ్‌, ‌సతీష్‌, ‌స్పెషల్‌ ఆఫీసర్‌ ఎల్లయ్య, మహేష్‌, ‌మెప్మా సభ్యులు, ప్రజలు  పాల్గొన్నారు.

Leave a Reply