Take a fresh look at your lifestyle.

పట్టణాభివృద్ధికి ప్రణాళిక: కలెక్టర్‌ ‌సిక్తా పట్నాయక్‌

Planning for urban development Collector Sikta Patnaik
అధికారులకు సూచనలు చేస్తున్న కలెక్టర్‌, ‌మంథని మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌పుటపుట్ట శైలజ
  • కలెక్టర్‌ ‌సిక్తా పట్నాయక్‌
  •  ‌పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ
  • 3నెలలలోపు పబ్లిక్‌ టాయిలెట్స్ ‌నిర్మాణం
  • విరివిగా మొక్కల పెంపకం

పెద్దపల్లి, మంథని పట్టణాల అభివృద్దికి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ ‌సిక్తా పట్నాయక్‌ ‌సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం పెద్దపల్లి మున్సిపాలిటీ పరి ధిలోని 19వ వార్డులో, మంథని మున్సిపాలిటీలోని 2వవార్డులో ఏర్పాటు చేసిన  పట్టణ ప్రగతి  కార్యక్ర మంలో కలెక్టర్‌ ‌పాల్గొన్నారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తు న్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకో వాలన్నారు. నూతన మున్సిపల్‌ ‌చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించి, అభివృద్దిలో వారిని భాగస్వా మ్యం చేయాలని కలెక్టర్‌ ‌సూచించారు. మున్సిపాలిటీలో ని ప్రతి వార్డుకు నియమించిన ప్రత్యేక అధికారి, వార్డు కౌన్సిలర్‌, ‌వార్డు కమిటి సభ్యులతో కలిసి వార్డు మొత్తం పాదయాత్ర చేసి, ఆయా వార్డులో ఉన్న ప్రాథమిక సమస్యలను గుర్తించాలన్నారు. పిచ్చి మొక్కలను, పొద లను, తుప్పలను, మురికి ప్రాంతాలను, నిర్మాణ వ్యర్థాల ను, చెత్తను తొలగించాలన్నారు. మొక్కలు నాటడానికి అనువైన ప్రదేశాలను గుర్తించి, హరిత ప్రణాళికను సిద్దం చేసుకోవాలన్నారు. సర్వే ద్వారా పట్టణంలోని నిరక్షరాస్యులను గుర్తించి, వారిలో చైతన్యం కల్పించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు. వీధి దీపాలు లేని విద్యుత్‌ ‌స్తంబాలను గుర్తించి ఎల్‌ఇడి బల్బులతో వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు.

 

ప్రమాదకరంగా ఉన్న వేలాడే విద్యుత్‌ ‌తీగలను, రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ ‌పార్మర్‌లను వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుం డా సరిచేయాలన్నారు. మహిళలకు అవగాహన కల్పిం చి ప్రతి ఇంట్లో తడి, పోడి చెత్తను వేరు చేసేలా ప్రోత్సహించాలన్నారు. పాలథీన్‌ ‌కవర్లను వాడకుండా బట్టసంచులను వాడేలా చూడాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్దవహించాలన్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో పబ్లిక్‌ ‌టాయిలెట్స్ ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలాలను గుర్తించి, 3నెలలలోపు పబ్లిక్‌ ‌టాయిలెట్స్ ‌నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాల ని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. వైకుంఠధామం, ఏకీకృత మార్కెట్‌, ఒపెన్‌ ‌జిమ్‌లను ఏర్పాటుకు స్థలాల ను పరిశీలించాలన్నారు. చెత్త నిర్వహణకు అనువుగా డంపింగ్‌ ‌యార్డు అవసరమైన స్థలా న్ని సేకరించాల న్నారు. వార్డు కమిటిల సమావేశం ఏర్పాటు చేసి అభివృద్దికి కావాల్సిన సూచనలు స్వీకరిం చి ప్రణాళిక సిద్దం చేయాలన్నారు. అందుబాటులో ఉన్న నిధులతో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ది కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. భారీ అభివృద్ది పనుల కొరకు ప్రతిపాదనలు సిద్దం చేసి నిధుల కొరకు ప్రభుత్వానికి సమర్పించాలని కలెక్టర్‌ ‌సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు. ఈ పర్యటనలో పెద్దపల్లి మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌డాక్టర్‌ ‌మమతారెడ్డి, మంథని మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌పుట్ట శైలజ, మున్సిపల్‌ ‌కమీషనర్లు చదల తిరుపతి, మల్లిఖా ర్జున స్వామి, సంబంధిత అధికారులు, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్‌ ‌సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply