Take a fresh look at your lifestyle.

చెరువులు నిండేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి: మంత్రి సత్యవతి రాథోడ్‌

Plan to fill the ponds
 సమీక్షలో మాట్లాడుతున్నమంత్రి సత్యవతి రాథోడ్‌, ‌చిత్రంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, ‌జడ్పీ చైర్‌పర్సన్‌ ‌బిందు, కలెక్టర్‌ ‌గౌతమ్‌

పనిచేయని అధికారులపై చర్యలు తప్పవు – సమీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్‌ 

జిల్లాలోని అన్ని చెరువులు ఎస్సారెస్పీ నీటితో నిండే విధంగా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలే చర్యలు చేపట్టాలని రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శా ఖ సత్యవతి రాథోడ్‌ ఇరిగేషన్‌ అధికారులను ఆదేశిం చారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌ ‌సమావేశ మందిరం లో నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ ‌చీఫ్‌ ‌తో కలిసి ఎస్సారెస్పీ మొదటి, రెండవ దశ, మధ్యతరహా నీటి పారుదల శాఖ ద్వారా జిల్లా వ్యాప్తంగా అందిస్తున్న సాగునీటి, చెక్‌ ‌డ్యాములు, ఫీడర్‌ ‌ఛానల్లు, ఓ టి ల నిర్మాణాల ప్రగతి, పెండింగ్‌ ‌పై ఆయా శాఖల చీఫ్‌ ఇం‌జనీర్లతో సమీక్ష సమావేశం చేశారుఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్సారెస్పీ మొదటి రెండవ దశ ప్రాజెక్టుల ద్వారా నీటి కాలువలకు ఓటి లు ఏర్పాటు చేసి జిల్లా లోని అన్ని చెరువులకు నీటితో నింపాలని. అందుకుగాను భారీ మధ్య తరహా నీటి పారుదల శాఖ అధికారులు కలసి కట్టుగా అంకితభావంతో పని చేయాల న్నారు. జిల్లాకు చెక్‌ ‌డ్యాములు మంజూరయ్యాయని, అందులో కొన్ని పెండింగ్లో ఉన్నాయని వాటికి గల కారణాలను ఇంజనీర్లతో, కాంట్రాక్టర్లతో చర్చించి వేగవంతం చేసి కేటాయించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్‌ ఆర్‌ ఎస్‌ ‌పి కాల్వలకు లెవలింగ్‌ ‌సక్రమంగా జరిగేలా నిర్వహించాలని, చాలా చెరువుల శిఖం భూమి అన్యాక్రాంతం అవుతుందని, అన్ని చెరువులకు ఎఫ్‌ ‌టి ఎల్‌ ‌హద్దులు బిగించాలి అన్నారు. గుండ్రాతిమడుగు రైతులకు సాగునీరు అందించాలని ఇంజనీరింగ్‌ అధికారులను పలుమార్లు ఆదేశించినప్పటికీ, ఇంతవరకు సాగినీరు రాకపోవడం అగ్రహం వ్యక్తం చేశారు. గుండ్రాతిమడుగుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్సారెస్పీ మొదటి దశ కాలువకు ఓటి లు లేవని వాటిని ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ల్యాండ్‌ ఆక్విజ్షన్‌ ‌కు డబ్బులు చెల్లించడం లేదని రైతుల సమ్మతితో వారి పొలాల గుండా ,ఫీడర్‌ ‌ఛానెల్‌ ‌లను చేపట్టాలని అన్నారు.

శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్ట్ ‌మొదటి దశలో డి బి ఎం 48 కాలువ ద్వారా జిల్లాలో 118176 ఆయకట్టకు సాగునీరు అందిస్తున్నామన్నారు. పునర్జీవన పనులైనా పూడికతీత, చెట్లు తీయుట, లైనింగ్‌ ‌మరియు ఇతర మరమ్మతు పనుల 60 శాతం పూర్తయ్యాయని, చిన్న పనులను త్వరగా చేపట్టి పూర్తి చేయాలన్నారు .ఎస్‌ ఆర్‌ఎస్‌పి, డిబియం 48 కెనాల్‌కు జిల్లాలోని మహబూ బాబాద్‌, ‌డోర్నకల్‌ ‌నియోజకవర్గాలలో 70 తూముల మంజూరు కాగా నాలుగు మాత్రమే పూర్తయ్యాయి, మిగిలిన 66 తూములను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలన్నారు. 2019-20 ఖరీఫ్‌ ‌కు గాను డీబీఎం 48 కాలువ ద్వారా 205 చెరువులు గుంటలు శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టు నీటి తో నింపడం జరిగింది అన్నారు. శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్ట్ ‌రెండవ దశ క్రింద జిల్లాలోని 28 గ్రామాలలోని 85,982 ఎకరాలకు డి బి ఎం 53, 55, 57, 59,60,, 61, 63, 69 డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీల ద్వారా సాగు నీరు అందించడం జరుగుతుందన్నారు.డిబి ఎం 60 కాలువకు జిల్లాలో 84 ఓ టి లు మంజూరు కాగా 38 పూర్తయ్యాయని పెండింగులో ఉన్న ఓ టీ లను వెంటనే పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా డిబి ఎం 61 కాలువ పనులు 80 శాతం మాత్రమే పూర్త య్యాయని, వాటిని త్వరితంగా పూర్తి చేయాలన్నారు.శ్రీ రామ్‌ ‌సాగర్‌ ‌ప్రాజెక్ట్ ‌నీటితో జిల్లాలోని 171 చెరువు లను నింపడం జరిగిందన్నారు.మైనర్‌ ఇరిగేషన్‌ ‌ద్వారా మిషన్‌ ‌కాకతీయ నాలుగు దశల్లో 1099 చెరువులకు గాను1077 చెరువుల పూడిక తియడం జరిగిందన్నా రు. ప్రభుత్వం 53 చెక్డ్యాంలు నిర్మాణానికి మంజూరు చేసిందని, త్వరితగతిన టెండర్‌ ‌ప్రక్రియ పూర్తి చేసి ప్రారంభించాలని అన్నారు.జిల్లా కలెక్టర్‌ ‌విపి గౌతమ్‌ ‌మాట్లాడుతూ శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టు మొదటి ,రెండో దశ పనులను వేగవంతంగా గడువులోగా పూర్తి చే యాలన్నారు. మైసమ్మ చెరువు ఫీడర్‌ ‌ఛానల్‌ ‌మంజూ రు అయినందున వెంటనే పనులు ప్రారంభించాలని అన్నారు. వారం రోజుల్లోగా నిజాం చెరువు అభివృద్ధి సుందరీకరణ పనులు వెంటనే ప్రారంభం కావాల ని లేనిచో కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవన్నారు. నీటి పారుదల శాఖ పై జనవరి చివరి వారంలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్‌ అధ్యక్షతన సమీక్ష నిర్వహిం చనున్నట్లు తెలిపారు. ఆయా మండల, గ్రామాల ప్రజాప్రతినిధులతో నీటిపారుదల శాఖ సహాయ ఇంజనీర్లు ఉన్న సమస్యలను తెలుసుకొని వచ్చే సమీక్ష నాటికి సమగ్ర నివేదిక తో రావాలని ఆదేశించారు.

అధికారుల నిరక్ష్యమే కారణం: ఎమ్మెల్యే
అధికారుల నిరక్ష్యం కారణంగా ఇంజినీర్ల అలసత్వం వల్ల పనులు నత్తనడక నడుస్తున్నా య శాసన సభ్యులు శంకర్‌ ‌నాయక్‌ అన్నారు. రెడ్యాల లక్ష్మీపురం చెరువు,నిజాం చెరువు ,బంధం చెరువు ల పై పనులు ప్రారంభించక పోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మైసమ్మ చెరువు మంజూరైన ను ఇంకనూ టెండర్‌ ‌ప్రక్రియ పూర్తి కాక పోవడం శోచనీయం అన్నారు. ఉన్న నిధులతో వెంటనే నిజాం చెరువు అభివృద్ధి పనులు చేపట్టి ఒక కళ వచ్చేలా చేయాలన్నారు..ఈ సమీక్షలో ఎస్సారెస్పీ మొదటి రెండవ దశ, మధ్యతరహా నీటి పారుదల శాఖ, చీఫ్‌ ఇం‌జనీర్లు శంకరయ్య, వీరన్న ఎస్సీలు రమేష్‌, ‌శ్రీనివాస్‌ ‌రెడ్డి ఈఈలు డీలు, సహాయ ఇంజనీర్లు, జిల్లా ప్రణాళిక అధికారి, వ్యవసాయ అధికారి, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.