Take a fresh look at your lifestyle.

పల్లె ప్రకృతి వనాలకు స్థలాలను సిద్ధం చేయాలి

  • ఆయుర్వేద, పండ్ల మొక్కలకు ప్రాధాన్యం
  •  కళ్ళలాల నిర్మాణానికి ప్రతిపాదనలు
  •  గ్రామ హరిత లక్ష్యాలను సాధించాలి
  •  పెద్దపల్లి కలెక్టర్‌ ‌సిక్తా పట్నాయక్‌

‌గ్రామాలో పల్లెప్రకృతి వనాల ఏర్పాటుకు అనువుగా స్థలాలను సన్నద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ ‌సిక్తా పట్నాయక్‌ ‌సంబంధిత అధికారులను ఆదేశించారు. ధర్మారం మండలంలోని మల్లాపూర్‌ ‌గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ఏర్పాటు అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ‌పాల్గొన్నారు. పల్లెలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలన్నారు. యాదాద్రిలో మియావాకి విధానం ద్వారా తక్కువ స్థలంలో చిట్టడవుల పెంపకం స్పూర్తిగా తీసుకొవాలన్నారు. ప్రతి గ్రామంలో డంపింగ్‌ ‌యార్డు, నర్సరీ, ట్రాక్టర్‌, ‌ట్యాంకర్‌, ‌ట్రాలీ సమకూర్చుకొవాలన్నారు. గ్రామపంచాయతీ పరిధిలో కంపోస్ట్ ‌షెడ్‌, ‌వైకుంఠదామం నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేసిన పనులు ప్రారంభించాలన్నారు. జిల్లాలో 76గ్రామాలో పార్కుల ఏర్పాటుకు స్థలాల ఎంపిక కొరకు ఎంపిడిఒలు, తహశీల్దార్లతో కలిసి స్థలాల ఎంపిక చేయాలన్నారు. ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రక్రియ 10రోజులో పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. పార్కులలో ఆయుర్వేద మొక్కలైన వేప, ఉసిరి, నేరేడు, సీమ చింత వంటి పండ్ల మొక్కలు నాటాలన్నారు.

రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు ఉపాధి హామీ నిధులను వినియోగిస్తూ కళ్ళాలను నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రతి గ్రామపంచాయతి పరిధిలో కనీసం 10 కళ్ళాలు నిర్మించేలా ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు.ఉపాధి హామీ కింద లేబర్‌ ‌టర్న ఔట్‌ ‌పెరిగే విధంగా చర్యలు తీసుకొవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఉపాధి కల్పించాలన్నారు. 6వ విడత హరితహారం లక్ష్యాల సాధనలో భాగంగా 15రోజుల్లో బ్లాక్‌ ‌ప్లాంటేషన్‌, అవెన్యూ ప్లాంటేషన్‌ ‌పూర్తి చేయాలన్నారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలను పంపిణీ చేయాలన్నారు. ధర్మారం మండలానికి వచ్చే రహదారికి ఇరు వైపులా అవెన్యూ ప్లాంటేషన్‌ ‌చేయాల న్నారు. గ్రామ హరిత ప్రణాళికను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. అనంతరం పల్లెప్రకృతి వనం ఏర్పాటుకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహం, కార్యచరణ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ పిడి వినోద్‌ ‌కుమార్‌, ‌జడ్పీ సీఈఒ గీత, డిపిఓ సుదర్శన్‌, ‌డిఎఫ్‌ఓ ‌రవిప్రసాద్‌, ‌డిహెచ్‌ఓ ‌జ్యోతి, డివిజన్‌ ‌పంచాయతీ అధికారులు, మండల పంచాయతీ అధికారులు, ఎంపిడిఒలు, ఎపిఒ, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply