Take a fresh look at your lifestyle.

‌ప్రకృతి వనాల ఏర్పాటుకు స్థలాలను సిద్ధం చెయ్యాలి

గ్రామాలలో ప్రకృతి వనాల ఏర్పాటు స్థలాలను సిద్దం చెయ్యాలని, హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో పని చెయ్యాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ‌క్రిష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం గోవిందరావుపేట మండలంలోని తహశీల్‌దార్‌, ‌ప్రభుత్వ ఆసుపత్రి, ఎంపిడివో కార్యాలయాలను ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల చుట్టు ఉన్న పరిసర ప్రాంతాలను, ఫైళ్ళను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ రహదారుల వెంట, కార్యాలయాల పరిసర ప్రాంతాలలో పిచ్చి చెట్లను తొలగించి వివిధ రకాల మొక్కలను నాటాలని సూచించారు. గ్రామాలలో అహ్లాదకరమైన వాతావరణం పెంచి మానసిక ఉల్లాసం అందించే విధంగా ప్రకృతి వనాలు ఏర్పాటు చెయ్యాలని అన్నారు. ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలని, ములుగు వెలుగు యాప్‌లో హజరు నమోదు చేయడమే కాకుండా సెలవుల వివరాలను పొందుపరుచాలని అన్నారు. కలెక్టర్‌ ‌వెంట తహశీల్‌దార్‌ ‌పి. బిక్షం, ఎంపిడివో ప్రవీణ్‌ ‌కుమార్‌, ‌వైద్యాధికారి సుగునకర్‌, ‌జడ్పిటిసి తుమ్మల హరిబాబు తదితరులు ఉన్నారు.

ప్రతి ఒక్కరు రక్తదానం చెయ్యాలి
ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడేందుకు రక్తం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరు రక్తధానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ‌క్రిష్ణ ఆదిత్య అన్నారు. కరోనా వైరస్‌ ‌కారణంగా ఎమ్మెల్యే సీతక్క పేద ప్రజలకు నిత్యవసర వస్తువులు, కూరగాయాలు పంపిణి చేసే కార్యక్రమం శుక్రవారంతో వంద రోజులు పూర్తి చేసుకోగా జిల్లా కేంద్రంలోని మహర్షి కళాశాలల ఆవరణలో రెడ్‌ ‌క్రాస్‌ ఆధ్వర్యంలో రక్తధాన శిభిరం నిర్వహించారు. శిభిరాన్ని ప్రారంభించినఅనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ ‌మాట్లాడుతూ రక్తం కోసం ఎవరు బయట తిరగకుండా రక్తాన్ని సేకరించి గ్రూపుల వారిగా నిల్వ చెయ్యాలని, సేకరించిన రక్తంలో ఏటూరునాగారం, ములుగు, ఎంజిఎం ఆసుత్రులలో నిల్వ చెయ్యాలని సూచించారు. ఎమ్మెల్యే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగ్గ విషయమని, రానున్న రోజులలో అధికారులతో రక్త సేకరణపై సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఏఎస్‌పి సాయి చైతన్య మాట్లాడుతూ లాక్‌డౌన్‌ ‌సందర్బంగా ఎమ్మెల్యే పేదలకు నిత్యవసర వస్తువులను పంపిణి చేయడమే కాకుండా రక్తధాన శిభిరం ఏర్పాటు చేయడం చెప్పుకోదగ్గ విషయమని, తమ పోలీస్‌ ‌శాఖ ఇలాంటి కార్యక్రమాలకు అండగా ఉంటుందని అన్నారు. సీతక్క మాట్లాడుతూ నిత్యం మన గురించే ఆలోచించకుండా ఎదుటి వారిని గుర్తించి ఆకలి తీర్చాలనే ఉద్దెశంతొ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, వస్తువుల పంపిణి కి తనకు అండగా ఉన్న వారిని ఎన్నటికి మరిచిపోలేనని అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరిడెంట్‌ ‌డాక్టర్‌ ‌జగదీష్‌, ‌డాక్టర్‌ ‌నారాయణ రెడ్డి, రెడ్‌ ‌క్రాస్‌ ‌ప్రతినిధి శ్రీనివాస్‌ ‌తదితరులు పాల్గోనగా, శిబిరంలో 151 మంది రక్తదానం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply