Take a fresh look at your lifestyle.

నిరాడంబర నిత్య తపస్వి పింగళి వెంకయ్య ( జయంతి సందర్భంగా నివాళి )

విజయవాడ,ఆగస్ట్ 2 : ‌స్వాతంత్య్ర సాధనకు అండ.. జాతీయ జెండా..జాతీయ జెండా రూపశిల్పి స్వర్గీయ పింగళి వెంకయ్య జయంతి సందర్బంగా ఆ మువ్వన్నెల పతాక రూపశిల్పిని ప్రతి ఒక్కరూ స్మరించాలి. శాంతి, సమానత, సౌర్యం ఇలా ఎన్నో భావాలను అందులో ఇనుమడింపజేసిన మహానుభావుడాయన.. భారతావనికి జాతీయ జెండా రూపశిల్పిగా మారిన ఓ మ•న్నత శిఖరం. స్వతంత్ర భారత సమర స్ఫూర్తికి పర్యాయపదంగా మారిన త్రివర్ణ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య. ఆ నిరాడంబర మహనీయుడు మన తెలుగువాడు కావడం మనకెంతో గర్వ కారణం. శ్రీపింగళి 1876, ఆగస్టు 2న కృష్టా జిల్లా దివి తాలూకలోని భట్లపెనుమర్రు గ్రామంలో జన్మించారు. 1921 మార్చి 31వ తేదీన విజయవాడలో జరిగిన భారత కాంగ్రెస్‌ ‌కమిటీ సమావేశంలో జెండాను రూపొందించి అందించారు.జాతీయోద్యమంలో తొలిసారిగా 1916లో లక్నో జాతీయ కాంగ్రెస్‌ ‌సభలో జాతీయపతాకను ఎగరవేశారు. పింగళి వెంకయ్య గొప్ప స్వాతంత్య్ర సమర యోధులు. 1919లో జలంధర్‌కు చెందిన లాలాహన్స్‌రాజ్‌ ‌మన జాతీయ పతాకంపై రాట్నం చిహ్నం ఉంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ అంగీకరించారు.

1921 లో అఖిలభారత కాంగ్రెస్‌ ‌మహాసభలు విజయవాడలో జరిగాయి. ఆ సభలో గాంధీజీ బందరు ఆంధ్రజాతీయ కళాశాల అధ్యాపకులుగా పనిచేస్తున్న పింగళి వెంకయ్యను పిలిపించి కాషాయం, ఆకుపచ్చ, మధ్యలో రాట్నం ఉండేలా జాతీయ జెండాను రూపొందించాలని కోరారు. వెంకయ్య వెనువెంటనే జాతీయ పతాకాన్ని రూపొందించి కాంగ్రెస్‌ ‌పార్టీకి అందించారు. ఆ తర్వాత సత్యం, అహింసలకు ప్రత్యేక నిదర్శమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ చెప్పడంతో ఆ జెండాలో అదనంగా తెలుపురంగును చేర్చడంతో మూడు రంగులతో నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి అందించారు.ఆ జెండా ఆంధ్రదేశంలోనే ఆవిర్భవించడం మనకు గర్వకారణం. తొలిరోజుల్లో జాతీయ పతాకంలోని రంగులు జాతిమతాలకు సంకేతాలకు భావించారు. క్రమేపీ అవి జాతి మతాతీత సంపదలుగా నిర్దారించబడ్డాయి.ఈ త్రివర్ణ పతాకంలో ఉండే మూడు గుర్తులు… కేసరి (కాషాయం) – ధైర్య, సాహసాలకు ప్రతీక, తెలుపు -శాంతి, సత్యాలకు, ఆకుపచ్చ -విశ్వాస, సౌభ్రాతృత్వానికి ప్రతీకలు. స్వాతంత్య్రం అనంతరం రాజ్యాంగ పరిషత్‌ ‌నెహ్రూ గారి సూచన మేరకు రాట్నానికి బదులుగా అశోక ధర్మచక్రాన్ని నిర్ణయించింది. అందులోనూ రాట్న చిహ్నమైన చక్రం ఉండటం గమనార్హం. భారత జాతికి స్ఫూర్తిగా నిలిచిన మన జాతీయ జెండా, ఆ జెండా రూపకర్త పింగళికి ’భారతరత్న’ బిరుదు లభిస్తే ఆ మహనీయుడికి నిజమైన నివాళి లభించినట్లే.

Leave a Reply