అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించి పెద్దల సభకు ఎన్నికైనందున వీరిద్దరు మండలి సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు.
ఈ మేరకు మండలి చైర్మన్కు బుధవారం తన రాజీనామా లేఖను పంపించగా ఆయన ఆమోదించారు. రాజ్యసభ ఎన్నికల్లో వీరిద్దరితో పాటు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని ఎన్నికైన విషయం తెలిసిందే.