Take a fresh look at your lifestyle.

ఎత్తు బంగారంతో దర్శనానికి తరలొస్తున్న భక్తులు

Pilgrims Coming to Darshan with height gold

తమ నిలువెత్తు బంగారంతో వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు మేడారంలోని సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోవడానికి తరలివస్తున్నారు. ఆదివాసీ గిరిజన అరాద్య దేవా లైన శ్రీ సమ్మక్క-సారలమ్మలను గత కోన్ని రోజు లుగా వివిధ గ్రామాల నుండి వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తు అమ్మవార్లకు తమ నిలువెత్తు బంగారం,పసుపు,కుంకుమలతో కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకుంటున్నారు. దీనిలో బాగంగా ముందుగా మేడారంలోని జంపన్న వాగులో పుణ్య స్నానాలు అచరించి అక్కడి నుండి నేరుగా అమ్మల చెంతకు చేరుకోని దర్శనానికి క్యూలైన్‌ల ద్వారా గద్దెల వద్దకు చేరుతున్నారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆదివాసీ గిరిజనుల అరాద్య దైవాలైన శ్రీ సమ్మ క్క-సారలమ్మలను దర్శించుకునే ముందు మేడా రంలోని జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి తరిస్తున్నారు. వాగు ఓడ్డుకే ఉన్న కళ్యాణ కట్టలో మొక్కులు ఉన్న వారు గుండ్లు చేయిం చుకోని పక్కనే ఉన్న జంపన్న వాగులో స్నానాలు చేస్తు జంపన్నకు మొక్కుకుంటున్నారు. అనంతరం అన వాయితీ ప్రకారం అమ్మవార్ల చెంతకు చేరుతున్నారు.

కల్వర్టులపై పేర్లను కాదు రోడ్లపై గుంతలను చూడండి:
శ్రీమేడారం సమ్మక్క-సారలమ్మల జాతరకు వస్తు న్న భక్తులు రోడ్డుకు ఇరువైపుల,కల్వర్టుల వద్ద ఉన్న ప్లెక్సీలు, వాల్‌ ‌రైటింగ్‌లను కాదు కాస్త రోడ్డు మార్గాన్ని సైతం చూస్తు తమ వాహనాలను నడపాలని పలువురు భక్తులు అరోపించుతున్నా రు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోన్న మేడారం జాతరను విజయవంతం చేయ్యాలని పట్టుదలతో కోన్ని రోజులుగా మేడారం పరిసర ప్రాంతాలను అభివృద్ది చేస్తు నిరంతరం పర్యవేక్షిం చుతున్నప్పటికి కోన్ని ప్రాంతాలలో అధికారుల నిర్లక్ష్యం వలన రోడ్లు ఇప్పటికే గుంతలు ఏర్పడి వాహన దారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నా యని అరోపించుతున్నారు. వాహన దారులకు సూచనల పత్రం మేడారం వెలుతున్న భక్తులకు ములుగు పోలీసుల అద్వర్యంలో భక్తులు తమతమ గమ్మస్థానాలకు సురక్షితంగా వెల్లడం కోసం స్థానిక పోలీసులు వాహన దారులు పాటించాల్సిన సూచనలు తెలిపే కరపత్రాలను వాహన దారులకు ములుగు సమీపంలోని గట్టమ్మ దేవాలయం వద్ద అందించా రు. దీనితో వాహన దారులు సురక్షితంగా తమ గ్రామాలకు తరలి వెల్లడం జరుగుతుందన్నారు.

అమ్మవార్ల పూనకాలతో తరలి వస్తున్న భక్తులు :

వివిధ ప్రాంతాల నుండి ఇప్పటికే అనేక మార్గాల గుండా మేడారంకు భక్తులు చేరుకుంటున్నారు. దీనిలో బాగంగా అమ్మవార్ల పూనకాలతో,ఎత్తు బం గారం ముద్దలతో,శివసత్తులు తరలి వస్తున్నా రు. జాతరలోని జంపన్న వాగు బ్రిడ్జీ ఫోల్స్ ‌కు ఇరువైపుల •ంస్కృతి, సాంప్రదాయాలు వెల్లి విరిసేలా చూపరులను ఆకట్టుకునేలా రంగురంగుల చిత్ర పఠాలు జాతరకు వచ్చిన భక్తులను అకట్టుకుంటున్నాయి.

భక్తులతో నిండిపోయిన గట్టమ్మ దేవాలయం:
శ్రీ మేడారంలోని సమ్మక్క-సారలమ్మల జాతర కు వచ్చే భక్తులు ముందుగా ములుగు జిల్లా సమీపంలోని గట్టమ్మదేవాలయంలోని అమ్మవారి కి ప్రత్యేక పూజలు చేసి మేడారం చేరుకోవడం అనవాయితీగా వస్తుంది. అందులో బాగంగానే సోమవారం మేడారం చేరుకోవాల్సిన భక్తులు వేల సంఖ్యలో గట్టమ్మ దేవాలయం వద్ద నిలిచి అమ్మవారికి తమ మొక్కులు అప్పగించుకున్నారు. దీంతో కోద్ది సమయం ఆలయ ప్రాంగణం భక్తు )తో కిటకిటలాడిపోయింది.

Leave a Reply