Take a fresh look at your lifestyle.

కొరోనా కట్టడికి భౌతిక దూరం.. పాటించాల్సిందే

  • లాక్‌డౌన్‌ ‌నిబంధనలతోనే ఇది సాధ్యం
  • గాంధీ దవాఖానా వైద్య నిపుణులు డాక్టర్‌ అనిల్‌కుమార్‌

కొరోనావైరస్‌ ‌నివారణకు మందులేదని, సామాజిక దూరం పాటించడం ద్వారానే వైరస్‌ను నివారించ వచ్చని గాంధీఆస్పత్రి వైద్యనిపుణులు డాక్టర్‌ అనిల్‌కుమార్‌ ‌తెలిపారు. ఇప్పుడున్న పద్దతిలో ముందుకు సాగితేనే దానిని దూరం చేయవచ్చన్నారు.ప్రజలు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను గౌరవించాలన్నారు. పరిస్థితి అర్ధం చేసుకుని ప్రజలు వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలన్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే తప్పకుండా సామాజిక దూరం పాటించాలన్నారు. బుధవారం సమాచార, పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో కరోనా వైరస్‌ ‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన డియా సమావేశంలో డాక్టర్‌ అనిల్‌కుమార్‌ అపోలో హాస్పిటల్‌ ‌కన్‌స్టలెంట్‌ ‌డాక్టర్‌ ‌సాయిరెడ్డితో కలిసి మాట్లాడారు. ఈసందర్భంగా డాక్టర్‌ అనిల్‌కుమార్‌ ‌మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ‌విజృంభిస్తోందని, అగ్రదేశాలు కూడా ఈ వ్యాధిబారిన పడుతున్నాయని అన్నారు.ప్రజలు సహకరించాలని, కరోనా వ్యాప్తి నివారణ అన్నది కేవలం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల మారత్రమే సాధ్యం కాదని, ఆ నిర్ణయాలను ప్రజబు తు.చ. తప్పకుండా పాటించాలన్నారు.

తలనొప్పి, జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే కరోనా సోకినట్టుగా నిర్దారించడానికి డాక్టర్‌ను సంప్రదించాలన్నారు. వైరస్‌కు వ్యాక్సిన్‌ ‌ప్రయోగ దశలో ఉందని, ప్రస్తుతం ఐసీయూఆర్‌ ‌సూచనల మేరకు బాధితులకు వైద్యం అందిస్తున్నామని అన్నారు గాంధీ ఆస్పత్రి కరోనా బాధితులకు పకడ్బందీ చికిత్స అందిస్తోందన్నారు రోజుకు 30 నుంచి 40 మంది డిశ్చార్జ్ అవుతున్నారని వివరించారు. ఈసందర్భంగా పల్మనాలజిస్ట్ ‌డాక్టర్‌సాయిరెడ్డి మాట్లాడుతూ అతిగా భయపడాల్సిన అవర లేదన్నారు. అదే విధంగా నిర్లక్ష్యం కూడా మంచిది కాదన్నారు. వాక్సిన్‌ ‌పూర్తిస్ధాయిలో అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుందన్నారు. కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలందరూ సమిష్టిగా ప్రభుత్వం చేపట్టే చర్యలను ఖచ్చితంగా పాటించాలన్నారు. స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటిస్తూ చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని సూచించారు. గొంతునొప్పి, జలుబు వస్తేకరోనా అని భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఏడాదిలో రెండుసార్లు ఇటువంటి లక్షణాలు సర్వసాధారణంగా వస్తాయన్నారు. ఒక వేళ లక్షణాలు ఎక్కువైతే డాక్టర్‌ను సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్‌ ‌డైరెక్టర్‌ ‌నాగయ్యకాంబ్లే, జాయింట్‌ ‌డైరెక్టర్‌ ‌జగన్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply