Take a fresh look at your lifestyle.

వ్యాక్సిన్‌ ‌వచ్చే వరకు భౌతికదూరం పాటించాల్సిందే

  • మాస్కు ధరించకుండా బయటకు పోరాదు
  • కొరోనాపై పోరులో ప్రస్తుతానికి ఇదే మందు
  • ఆత్మస్థయిర్యంతో పోరాడుదాం
  • యూపి ఆత్మ నిర్భర్‌ ‌కార్యక్రమంలో ప్రధాని మోడీ

కొరోనా వైరస్‌కు వాక్సిన్‌ ‌వచ్చే అందరూ భౌతిక దూరం పాటిస్తూ.. మాస్క్ ‌ధరించాలని మరోసారి దేశ ప్రజలకు ప్రధాని మోదీ సూచించారు. కొరోనా నుంచి బయటపడాలంటే ప్రస్తుతానికి అదొక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు. భైతికదూరం పాటిస్తూ మాస్కు కట్టుకుని మసలుకోవాలని అన్నారు.  శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ఆత్మ నిర్భర్‌ ఉత్తర్‌ ‌ప్రదేశ్‌ ‌రోజ్‌గార్‌ అభియాన్‌ ‌పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, అధికారులు, వలస కార్మికులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు కరోనా వైరస్‌కు వాక్సిన్‌ ‌రాలేదని, వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే అందరూ రెండడుగుల దూరాన్ని పాటించాలని ప్రధాని అన్నారు.  మాస్క్‌లు ధరించాలి. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో యూపీ ప్రజలు తమ తెగవను చూపారు. విజయవంతంగా కోవిడ్‌ను ఎదుర్కోగలిగారు. ఈ సందర్భంగా ప్రధాని యూపీలోని 6 జిల్లాలోని గ్రామస్థులతో వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా మాట్లాడారు. కష్టం వచ్చిందని కృంగిపోకుండా ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ప్రతీ ఒక్కరూ ప్రయత్నించాలని..దీనికి ప్రజలందరూ సహకరించాలని తద్వారా ఆర్థికంగా బలపడాలని ప్రజలకు ప్రధాని మోడీ సూచించారు. కష్టం వచ్చిన సమయంలో ప్రజలు సమన్వయంతో తిరగి బలపడేలా ఆత్మవిశ్వాసంతో పోరాడటంలో భారతీయులు ఎప్పుడు ముందుంటారని మోదీ తెలిపారు. కరోనాతో ప్రపంచ దేశాలన్నీ పోరాడుతున్నాయనీ.. ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రపంచం యుద్ధం చేస్తోందని.. కానీ మనిషి ఓడిపోవడానికి సిద్ధంగా లేడని ప్రధాని కష్టంనుంచి కోలుకుని మనిషి నిలబడతాడని అప్పుడు ఇటువంటి ఎన్ని కఠినవైరస్‌ ‌లు వచ్చినా మనలని ఏ చేయలేవనీ ప్రతీ మనిషి పోరాటాన్ని అలవరచుకుని కష్టాల్ని జయించాలని సూచించారు.

 

ఈ వైరస్‌ ‌నుంచి మనం కాపాడుకుంటూనే ముందుకు వెళ్లాలని.. మనం మరింత దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్లాలని మోడీ ప్రజలను చైతన్యం చేశారు. మన సంకల్పం.. ఈ సంక్షోభం కంటే చాలా గొప్పదన్నారు. 21వ శతాబ్దం భారతదేశానిదేన్నైనా సరే ఆత్మస్థైర్యం కలిగిన భారత్‌ ‌ను ఏ చేయలేవని అన్నారు. ప్రస్తుతం దేశం కీలకమైన దశలో ఉందని, ఈ సంక్షోభం మనకు ఒక అవకాశంగా మారాలని ప్రధాని ఆకాంక్షించారు. కాగా..కరోనా వైరస్‌ ‌కారణంగా కుదేలైన ఆర్ధిక వ్యవస్థకు ఊపిరిలూదడానికి ఆత్మ నిర్భర్‌ ‌భారత్‌ అభియాన్‌ ‌పేరిట రూ. 20 లక్షల కోట్ల ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజ్‌ను ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో పలు రాష్ట్రాల నుంచి సొంత గ్రామాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు గరీబ్‌ ‌కల్యాణ్‌ ‌రోజ్‌గార్‌ అభియాన్‌ను ప్రధాని మోదీ ఈ నెల 20న దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో  వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ప్రారంభించారు. పలు జిల్లాలకు చెందిన ఉపాధి కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ పథకంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని 31 జిల్లాలకు చెందిన వలస కార్మికులకు 125 రోజులపాటు ఉపాధి కల్పిస్తారు.

అలాగే ప్రభుత్వ శాఖలకు చెందిన 25 కేటగిరి పనుల కోసం 1.25 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ఇందులో భాగంగా జాతీయ గ్రాణ ఉపాధి పథకం కింద రోజుకు 60 లక్షల మందికి పని కల్పిస్తారు. అలాగే 2.4 లక్షల పరిశ్రమలకు రూ.5,900 కోట్ల రుణాలు,  1.11 లక్షల చిన్న పరిశ్రమలను నెలకొల్పేందుకు రూ.3,226 కోట్ల నిధులను యూపీ ప్రభుత్వం అందించనున్నది. అలాగే విశ్వకర్మ శ్రామ్‌ ‌సమ్మన్‌ ‌యోజనకింద ఒక జిల్లాకు ఒక ఉత్పత్తి పథకం కింద 1.25 లక్షల మందికి ప్రైవేట్‌ ‌నిర్మాణ కంపెనీల్లో నియామక పత్రాలతోపాటు 5 వేల మందికి సంబంధిత పరికరాలను అందజేస్తారు. దేశవ్యాప్తంగా 116 జిల్లాల్లో ఆత్మ నిర్భర్‌ ‌రోజ్‌గార్‌ ‌యోజన పథకాన్ని అమలు చేయనున్నారు. వలస కార్మికులకు 125 రోజుల పాటు ఉపాధి కల్పించనున్నారు. వలస కార్మికులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో మాత్రమే ఈ పథకం అమలు చేస్తున్నారు. బీహార్‌లో అత్యధికంగా 32 జిల్లాల్లో గరీబ్‌ ‌కల్యాణ్‌ ‌రోజ్‌గార్‌ ‌యోజన పథకం వర్తిస్తుంది. ఇక యూపీలో 31, మధ్యప్రదేశ్‌లో 24, రాజస్థాన్‌లో 22 జిల్లాలు ఉన్నాయి. పథకం ప్రారంభమైనందున అక్కడి వలస కార్మికులకు పని కల్పించనున్నారు.

Leave a Reply