Take a fresh look at your lifestyle.

‘‘ఎన్నో భావాలను ఒక్క చిత్రంతో తెలిపేదే ఫొటోగ్రఫీ’’

“అం‌దమైన జ్ఞాపకాలు… తియ్యటి అనుభూతులు… మధుర ఘట్టాలు.. విషాద సన్నివేశాలు… వెలకట్టలేని దృశ్యాలను పదికాలాల పాటు పదిలంగా మన కళ్ల ముందు ఉంచేది ఫొటో. జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలను, గత స్మృతులను నెమరు వేసుకోవడం ఫొటోలతోనే సాధ్యం.. వంద మాటలతో చెప్పలేనిది ఒక్క ఫొటోతో చెప్పొచ్చు.. మనసు దోచే దృశ్యాలు… ఆలోచింపజేసే రూపాలు… వెరసి ఫొటోగ్రఫీ. అంతటి శక్తివంతమైనది ఫొటోగ్రఫీ.  ప్రతీ సంవత్సరం ఆగష్టు 19 న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటారు.”

నేడు ప్రపంచ ఛాయ చిత్ర దినోత్సవం..(ఫోటో గ్రఫి డే)

అందమైన జ్ఞాపకాలు… తియ్యటి అనుభూతులు… మధుర ఘట్టాలు.. విషాద సన్నివేశాలు… వెలకట్టలేని దృశ్యాలను పదికాలాల పాటు పదిలంగా మన కళ్ల ముందు ఉంచేది ఫొటో. జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలను, గత స్మృతులను నెమరు వేసుకోవడం ఫొటోలతోనే సాధ్యం.. వంద మాటలతో చెప్పలేనిది ఒక్క ఫొటోతో చెప్పొచ్చు.. మనసు దోచే దృశ్యాలు… ఆలోచింపజేసే రూపాలు… వెరసి ఫొటోగ్రఫీ. అంతటి శక్తివంతమైనది ఫొటోగ్రఫీ.  ప్రతీ సంవత్సరం ఆగష్టు 19 న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటారు. ఎన్నో భావాలను ఒక్క చిత్రంతో తెలిపే గొప్పదనం ఫొటోగ్రఫీకి ఉంది. ఆధునిక కాలంలో మానవజీవితంతో ఫొటోగ్రఫీకి విడదీయలేని బంధం ఉంది. ఫొటోగ్రఫీకి శతాబ్దాల చరిత్ర ఉంది. రసాయనాలతో రూపొందించిన ప్లేటుపై కాంతిచర్యతో ఓ రూపాన్ని బంధించడాన్ని ఫొటోగ్రఫీ అంటారు. రెండు గ్రీకు పదాల కలయికే ఫొటోగ్రఫీ. ఫొటో అంటే చిత్రం, గ్రఫీ అంటే గీయడం అని అర్థం. ఫొటోగ్రఫీ అంటే కాంతితో చిత్రాన్ని గీయడం. 18వ శతాబ్దంలో పారిస్‌లో నలుపుతెలుపులతో ప్రారంభమైన ఛాయాచిత్రం కాలక్రమంలో రంగులు అద్దుకుంటూ కొత్తపుంతలు తొక్కుతోంది. డిజిటల్‌ ‌సాంకేతిక విప్లవం ఫలితంగా ఇప్పుడది సెల్‌ఫోన్‌లో ఒదిగిన కెమరాలు, పాకెట్‌ ‌కెమెరాల రూపాల్లో సామాన్యుడి చేతిలో ఇమిడిపోతోంది.

ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్‌ ‌జే.ఎం.డాగ్యూరే 1837లో ఫొటోగ్రఫీ ప్రాసెస్‌ను కనుగొన్నారు. అంతకు ముందు 1826లో ఫ్రాన్స్‌కు చెందిన జోసెఫ్‌ ‌నైసిఫోరా నీప్సీ ఫొటోగ్రఫీ చరిత్రలో తొలిసారిగా ఛాయాచిత్రాన్ని తయారు చేశారు. ఇంటి వెనక పెరట్లో 8 గంటల పాటు ఛాయాచిత్రాన్ని సిల్వర్‌ అణువులు ఉన్న ప్లేట్‌పై బంధించారు. కానీ దానిని ఎక్కువ రోజులు నిల్వ చేయలేకపోయారు. 1839 జనవరి 9న ఫెంచ్‌ అకాడమీ ఆఫ్‌ ‌సైన్సెస్‌ ‌డాగ్యూరే టైప్‌ ‌ప్రాసెస్‌ను అధికారికంగా ప్రకటించింది. తర్వాత కొద్దినెలలకు 1839 ఆగస్టు 19న ఫ్రాన్స్ ‌ప్రభుత్వం ఫొటోగ్రఫీపై పెటెంట్‌ ‌హక్కులను కొనుగోలు చేసి దానిని ప్రపంచానికి ఉచిత బహుమతిగా అందించింది. అందుకే ఏటా ఆగస్టు 19ని ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంగా జరుపుతున్నారు. ఇండియా ఇంటర్నేషనల్‌ ‌ఫొటోగ్రఫిక్‌ ‌కౌన్సిల్‌ 1991 ‌నుంచి దేశంలో ప్రతియేటా ఆగస్టు 19న ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపడం ప్రారంభించింది. మనదేశంలో 1857 వరకు కూడా ఫొటోగ్రఫీ అందుబాటులోకి రాలేదు. కేవలం బ్రిటీష్‌రాజు, జమిందారులు, సిపాయిలు మాత్రమే దీన్ని ఉపయోగించేవారు. 1877 నుంచి ఫొటోగ్రఫీ సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. దేశంలో మొట్టమొదటిసారిగా లాలా దీనదయాళ్‌ ‌శ్రీకారం చుట్టారు.

ఫొటోగ్రఫీకి ప్రాణమైన కెమెరాలు మొదట్లో చాలా పెద్దసైజులో డబ్బా అంత ఉండేవి. ఆ పరికరాల ధర తక్కువే అయినా మానవ కృషి, నైపుణ్యంపైనే ఫొటోగ్రఫీ ఆధారపడి ఉండేది. మొదట్లో ఎయిమ్‌ ఆం‌డ్‌ ‌షూట్‌ ‌కెమెరాలు వాడుకలో ఉండేవి. ఇవి ఆకారంలో పెద్దగా ఉన్నా కొద్ది దూరంలోని వస్తువులనే కెమెరాలో బంధించగలిగేవి. తర్వాత ఫీల్డ్ ‌కెమెరాలు వచ్చా యి. ఇవే నల్లగుడ్డతో ముసుగు వేసుకొని ఫొటో తీసే కెమెరాలు. కేవలం రెండు ఫిల్ములు మాత్రమే ఉండి, అవి కూడా పల కలంత సైజులో ఉండటం వల్ల కేవలం రెండు ఫొటోలు మాత్రమే తీసేందుకు వీలుండేది. దీనివల్ల మోతబరువు తప్ప ఫొటోల నాణ్య త కూడా అంతంత మాత్రంగానే ఉండేది. ఆ తర్వాత టీఎల్‌ఆర్‌ (‌ట్వి న్‌లెన్స్ ‌రిఫ్లెక్టర్‌) ‌కెమెరాలు వచ్చాయి. మెడలో కెమెరా వేసు కొని కిందికి చూస్తూ ఫొటోలు తీసే వారు. ఎస్‌ఎల్‌ఆర్‌ (‌సింగిల్‌ ‌లెన్స్ ‌రిఫ్లెక్టర్‌) ‌కెమెరాలు వచ్చిన తర్వాత 35 ఫొటోలు తీసే సామర్థ్యం వచ్చింది. ఇందులో లెన్స్ ‌మార్చుకునే సదుపాయమూ వచ్చింది. ఆ తర్వాత డిజిటల్‌ ‌కెమెరాల రాకతో ఫొటోగ్రఫీకి నిర్వచనమే మారిపోయింది. చిన్న సైజు మెమొరీ కార్డుతో వందలాది ఫొటోలు తీసే సామర్థ్యం, స్పష్టమైన రంగుల్లో అద్భుతమైన ఫొటోలు తీసే నైపుణ్యం అందరికీ అందుబాటులోకి వచ్చింది. వైడ్‌, ‌టెలి లెన్స్ ‌రెండింటికీ డిజిటల్‌ ‌టెక్నాలజీ జో డించి ఛాయాచిత్రాలను నిమిషాల్లో అంద జేసేందుకు ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది.

‘‘పాస్‌పోర్ట్ ‌సైజు నుంచి ఫ్లెక్సీల వరకు.’’..
గతంలో చదువులు, ఉద్యోగాల కోసం దిగే పాసుపోర్టు సై జు ఫొటో మొదలుకొని నేడు నిలువెత్తు సైజుల ఫ్లెక్సీవరకు వ్యాపించింది. కేవలం పట్టణ వాసులనే కాకుండా గ్రామీణు లను సైతం ఫొటోగ్రాఫీ విపరీతంగా అలరిస్తోంది. ఫలితంగా ఇళ్లలో గోడలపై ఫ్రేములుగా, అల్బమ్‌ ‌కవర్లలో ఉండాల్సిన ఫొటోలు వీధి వీధినా, గ్రామ గ్రామాన ఫ్లెక్సీ బోర్డులుగా దర్శ నమిస్తున్నాయి. ఫొటోల మాదిరిగానే ఛాయాచిత్రకళ (ఫొటో గ్రఫీ) సైతం అనేక దశలు దాటి జైత్రయాత్ర సాగిస్తోంది. త లపై నల్లటి వస్తాన్న్రి ముసుగు వేసుకొని సూర్యకిరణాల ఆ ధారంగా తీసే ఫొటోల స్థానంలో క్షణాల్లో సాక్షాత్కరించే డిజిటల్‌ ‌టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కంప్యూటర్‌ ‌పరి జ్ఞానం కూడా తోడవడంతో ఫొటోగ్రఫీ ఎంతో సులువైంది.

ఫొటోగ్రఫీలో ఒకప్పుడు పురుషులు మాత్రమే ఉండేవా రు. కానీ ప్రస్తుతం పురుషులతో సమానంగా మహిళలు కూడా ఈ రంగంపై మక్కువ కనబరుస్తున్నారు. వెబ్‌ ఆ ‌ధారిత సేవలు అందుబాటులోకి రావడంతో యానిమేషన్‌, ‌జియోస్పేషియల్‌, ‌పాత్రికేయం, ప్రచారం, మల్టీమీడియా, ఫ్యాషన్‌ ‌రంగాల్లో ఫొటోగ్రఫీకి ఎనలేని డిమాండ్‌ ‌నెలకొం ది. మీడియా రంగంలో ఉన్న అవకాశాలు, స్వయం ఉపాదికి చక్కని వేదికగా ఉండటం వల్ల పురుషులతో పాటు మహిళలు ఫొటోగ్రఫీలో రాణించడానికి ఇష్టపడుతున్నా రు. కేవలం ఫొటోగ్రఫీనే వృత్తిగా ఎంచుకునే వారు కొంద రైతే మరికొందరు సృజనాత్మకతను చాటుకునేందుకు ఫొటోగ్రఫీపై మక్కువ చూపిస్తున్నారు. హైదరాబాద్‌, ‌బెంగుళూరు,చెన్నయ్‌ ‌లలో  ఫొటోగ్రఫీ సంబంధిత రంగాల్లో విస్తృతమైన అవకాశాలున్నాయి. రోజుకో కొత్తదనాన్ని ఆస్వాదించే నగరంలో ఫ్యాషన్‌ ‌రంగంలో ఎక్కువ అవకాశాలున్నాయి.

నగరంలోని జేఎన్‌టీయూలో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ‌ఫైన్‌ ఆర్టస్, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వెంకటేశ్వర ఫైనార్టస్ ‌కళాశాల, లకోటియా ఫ్యాషన్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో ఫొటోగ్రఫీలో శిక్షణనిస్తున్నారు. వీటిలోనే కాకుండా పలు ప్రైవేట్‌ ‌శిక్షణ కేంద్రాల్లో కూడా ఫొటోగ్రఫీలో శిక్షణ ఇస్తున్నారు. జేఎన్‌టీయూ ఫైన్‌ ఆర్టస్ ‌విభాగంలో ఫొటోగ్రఫీతో పాటు విజువల్‌ ‌కమ్యూనికేషన్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందినవారెందరో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించారు. ఫొటోగ్రఫీ నాలుగేళ్ల కోర్సులో ఎనిమిది సెమిస్టర్లుంటాయి. 30 సీట్లను ప్రవేశపరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఫొటోగ్రఫీ, జనరల్‌ అవేర్‌నెస్‌, ‌డ్రాయింగ్‌, ‌కలరింగ్‌లపై ఆప్టిట్యూడ్‌ ‌టెస్ట్ ‌నిర్వహిస్తారు. జూలైలో ప్రవేశాలు, ఆగస్టులో తరగతులుంటాయి. ఫ్యాషన్‌, ‌పారిశ్రామిక, పర్యాటక, ట్రావెల్‌, ‌జర్నల్‌లకు సంబంధించి ఫొటోగ్రఫీ, కంప్యూటర్‌ ‌గ్రాఫిక్స్‌లో కూడా శిక్షణ ఉంటుంది.నేడు నగరాలలో,పట్టణాలు,గ్రామాల్లో విపరీతంగా ఫొటొ స్టుడియో లు వెలిశాయి.ఉద్యోగాలు రాని పట్టభద్రులు,ఉన్నత విద్యావంతులు ఫొటో స్టుడియో పెట్టుకొని జీవనోపాధి పొందుతున్నారు.ప్రస్తుతం ఒక స్టుడియో పెట్టాలంటే సుమారు అయిదు లక్షలు వరకు ఖర్చు అవుతుంది అని అంచనా.కెమరా లకు ఖరీదు ఎక్కువే.కరొనా నేపధ్యంలో విద్యా సంస్థలు మూత పడటంతో,ప్రజలు బయటికి వెళ్ళకపోవడము వలన ఫొటో స్టుడియో కి వెళ్లి ఫొటోలు దిగే పరిస్థితి లేక పోవడం వల్ల వారు బ తకడం కస్టంగా మారింది.కిరాయి మందం కుడా గిట్టు బాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఫొటోగ్రఫీ సంఘాలు మండల,జిల్లా స్థాయి లలో ఏర్పాటు చేసి పలు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు.మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తాన్ని సేకరించడం,పేదరికం లో వున్న ఫొటో గ్రాఫర్లను ఆదుకోవడం,ప్రతి యేట బెస్ట్ ‌ఫొటో గ్రాఫర్‌ ‌లను ఎంపిక చేసి ప్రముఖుల చేత సన్మానమునిర్వహించడం లాంటి మంచి కార్యక్రమంలు చేస్తున్నారు.

మొన్న కరొనా విలాయ థాండవం చేసినపుడు వలస కూలీలు,నిరుపేదలకు నిత్యావసర వస్తువులు ఆంద చేసి తమ దాతృత్వంను చాటుకున్నారు.తాము సంపాదించిన దానిలో కొంత వరకు అయిన సామాజిక కార్యక్రమాలకి ఖర్చు చేస్తూ నిజాయితీగా బ్రతుకుతూ వున్నారు.కరొనా విపరీతంగా వున్నపుడు పత్రిక ఫొటో గ్రాఫర్‌ ‌లు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆస్పత్రులు,రోగులు,పోలీస్లు,పారిశుద్ధ్య కార్మికులు ఫోటోలు తీసి సమాజానికి అంధించారు.ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలు,వరదలు,కి సంబంధించిన ఫోటోలను చిత్రీకరించడం,పలు రకాల పత్రికలులొ చూస్తూవు న్నాము.ప్రాణాలకు తెగించి ఫోటోలు తీసి తాము యేమిటో నిరూపిస్తున్నారు.వయసు పైబడిన ఫొటో గ్రాఫర్‌ ‌లకు ప్రభుత్వము పింఛను మంజూరు చేయాలి,డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇల్లు అర్హుడైనవారికి ఇప్పించాలి.ప్రభుత్వ పథకాలలో తగిన ప్రాధాన్యతనిచ్చి వారి విలువను పెంచాలి.ఫొటొ గ్రాఫి రంగంని ఆధరించి,ఫొటో గ్రాఫర్లకి గౌరవం అంద చేద్దాం.

kami reddy sathis reddy
కామిడి సతీశ్‌ ‌రెడ్డీ, జడలపేట, జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా, 9848445134

Leave a Reply