Take a fresh look at your lifestyle.

పలు భావాల సమాహారం ఫోటోగ్రఫీ

“ఫోటోలు తీయించుకుంటే ఆయుర్దాయం తగ్గుతుందనే నమ్మకం మన దేశంలోనూ చాలాకాలం ఉండేది. మనదేశంలో 1857 వరకు ఫోటోగ్రఫీ అందుబాటు లోకి రాలేదు. కేవలం బ్రిటిష్‌ ‌రాజు, జమీందారులు, సిపాయిలు మాత్రమే దీనిని ఉపయోగించే వారు. 1977 నుంచి ఫోటోగ్రఫీ సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో మొట్టమొదటి సారిగా లాలా దీనదయాళ్‌ ‌ఫొటోగ్రఫీకి శ్రీకారం చుట్టారు. సమయం, సందర్భం ఏదైనా, నేడు ఫోటో లేని జీవితం ఊహించుకోలేం.”

  • నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

నాగరికంగా మనిషి ఎదగటం మొదలైన దశలో మానవుడికి తాను చూస్తున్న వాటిని వారసత్వ సంపదగా అందించాలనే కోరిక ఉండేది. కోరిక నుండి ఉద్భవించిన మహాద్భుతమే ఫోటోగ్రఫీ. ఎక్కడో రాతి గుహల గోడల మీద సూర్యకాంతి పడిన చోట నల్లగా మారటం గమనించి, కొన్ని రసాయ నాలు వెలుతురు పడిన మేర నల్లటి ఆకృతిని ఏర్పరుస్తాయన్న విషయం అర్థంచేసుకుని క్రమంగా ఫొటోగ్రఫీ ఆవిర్భావానికి బీజం వేసాడు మానవుడు. ఎన్నో భావాలను ఒక్క చిత్రంతో తెలిపే గొప్పదనం ఒక్క ఫొటోగ్రఫీకి ఉంది. ఈ ఆధునిక కాలంలో మానవ జీవితంతో ఫొటోగ్రఫీకి విడదీ యలేని బంధం ఉంది. ఫొటోగ్రఫీకి శతాబ్ధాల చరిత్ర ఉంది. రసాయనాలతో రూపొందించిన ప్లేటుపై కాంతిచర్యతో ఓ రూపాన్ని బంధించడాన్ని ఫొటోగ్రఫీ అంటారు. రెండు గ్రీకు పదాల కలయికే ఫొటోగ్రఫీ. ‘‘ఫోటో అంటే చిత్రం’’, ‘‘గ్రఫీ అంటే గీయడం’’ అని అర్ధం. ఫొటోగ్రఫీ అంటే కాంతితో చిత్రాన్ని గీయడం.

18వ శతాబ్దంలో పారిస్‌లో నలుకు తెలుపులతో ప్రారంభమైన ఫొటోగ్రఫీ కాల క్రమంలో రంగులు అద్దుకుంటూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఫాన్స్‌కు చెందిన లూయిస్‌ ‌జే.ఎం.డాగ్యూరే 1837లో ఫొటోగ్రఫీ ప్రాసెస్‌ను కనుగొన్నారు. 1839 జనవరి 9న ఫెంచ్‌ అకాడమీ ఆఫ్‌ ‌సైన్సెస్‌ ‌డాగ్యురే టైప్‌ ‌ప్రాసెస్‌ను అధికారికంగా ప్రకటించింది. పూర్తి రూపం ఇచ్చి ఫోటోగ్రఫీ అనే ప్రక్రియను ప్రపంచానికి తెలియ జెప్పేందుకు ఆ తర్వాత మరో 280 సంవత్సరాలు పట్టింది. ఈ మధ్యలో ఎందరెందరో పరి శోధకులు ప్రయోగాత్మకంగా దృశ్యాన్ని లోహం మీద బంధించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి ఆ ఖ్యాతి దక్కింది ఎల్‌.‌జె.ఎల్‌. ‌కు, 1837 ఫ్రెంచి ప్రభుత్వం ఆకాడమీ ఆఫ్‌ ‌సైన్సెస్‌ ‌వారి ముందు డాగురే తాను కనుగొన్న ఒక కొత్త పరికరాన్ని ప్రదర్శించాడు. బయటవున్న చిత్రాన్ని ఒక నల్లటి ఫలకంపై ముద్రించి, ఆ పైన దానిని ప్రాసెస్‌’ ‌చేసి ఆ చిత్రాన్ని శాశ్వతంగా ప్రదర్శించ గలిగినదే ఆ ప్రక్రియ. అది జరిగింది జనవరి 9, 1839. ఆ అద్భుత మైన ఆవిష్కారానికి హక్కులు పరిశోధకుడికి ఇచ్చారు.

అయితే ఇది ఒక వ్యక్తి హక్కు కాకూడదని భావించిన ఫ్రాన్స్ ‌ప్రభుత్వం, ఆ పాటోగ్రఫీ పేటెంట్‌ ‌తాను కొనుగోలు చేసి, ప్రపంచానికి ఉచిత బహుమతిగా ప్రకటించిన తేదీ ఆగష్టు 19, 1839. అలా ప్రపంచమంతా పోటోలు తీసుకునే హక్కును పొందిన ఆ తేదీని ప్రపంచ పాటోగ్రఫీ దినోత్సవంగా జరుపు కుంటారు. తొలి రోజుల్లో ఫోటోలు తీయించు కొనేందుకు మనుషులు భయపడే వారంటే నమ్మగలరా! తొలినాటి కెమెరా ఫోటో కావాలంటే దాని ఎదురుగా మనిషి 45 నిమిషాలపాటు కదలకుండా కూర్చోవాలి. అయితే ఆ ‘ రాకాసీ’ (కెమెరా) మనిషి లోని శక్తిని లాగేస్తుందని, ఫోటో తీయించుకుంటే జీవ శక్తి తగ్గిపోయి త్వరగా మరణిస్తారని భావించి నాడు ప్రజలు భయంతో దూరంగా సాగి పోయారు. ఫోటోలు తీయించుకుంటే ఆయుర్దాయం తగ్గుతుందనే నమ్మకం మన దేశంలోనూ చాలాకాలం ఉండేది. మనదేశంలో 1857 వరకు ఫోటోగ్రఫీ అందుబాటు లోకి రాలేదు. కేవలం బ్రిటిష్‌ ‌రాజు, జమీందారులు, సిపాయిలు మాత్రమే దీనిని ఉపయోగించే వారు. 1977 నుంచి ఫోటోగ్రఫీ సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో మొట్టమొదటి సారిగా లాలా దీనదయాళ్‌ ‌ఫొటోగ్రఫీకి శ్రీకారం చుట్టారు. సమయం, సందర్భం ఏదైనా, నేడు ఫోటో లేని జీవితం ఊహించుకోలేం.

ఎన్నో భావాలను ఒక్క చిత్రంతో తెలిపే గొప్పదనం ఒక్క ఫొటోగ్రఫీకి ఉంది. ఈ ఆధునిక కాలంలో మానవ జీవితంతో ఫొటోగ్రఫీకి విడదీయలేని బంధం ఉంది. అప్పుడే పుట్టిన పసిబిడ్డ నుండి, అంతిమ యాత్ర వరకు ప్రతి దశ కెమెరాతో బంధించాల్సిందే. ఇప్పుడు ప్రతి సెల్‌ ‌ఫోన్‌ ఒక కెమెరా. సెల్‌ ‌ఫోన్‌ ‌వున్న ప్రతి ఒక్కరూ ఫొటోగ్రాఫిలో నైపుణ్యం పొందుతున్నారు. ఫోటోగ్రాఫర్‌ ‌తీసే ఫోటో చూస్తే కలిగే ఆనందం వేరు. నలుపు తెలుపు అయినా, సప్త వర్ణాలతో తీసింది అయినా మనసును తట్టి తీరుతుంది. అలా ఆవిర్భవించిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవానికి ఏ యేటి కాయేడు ఆదరణ పెరుగుతోంది. ఎందరెందరో కెమెరాతో ట్రిక్కులు చేస్తున్నారు. తమ సృజనను ప్రదర్శి స్తున్నారు. ప్రతి సంవత్సరపు ఫోటో గ్రాఫిక్‌ ‌దినోత్సవం కొత్త కొత్తగా కొనసాగుతోంది. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఏటా నిర్వహి స్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఫోటో ప్రదర్శనతో పాటు, ప్రపంచ ఫొటోగ్రపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్ధాయి ఫొటోగ్రఫీ పోటీలలో గెలుపొందిన వారికి అవార్డులను ప్రధానం చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
– రామకిష్టయ్య సంగనభట్ల…
9440595494

Leave a Reply