Take a fresh look at your lifestyle.

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
పెట్రో దరలకు నిరనగా ఒడిషాలో బంద్‌
దేశంలో చమురు ధరల మంట కొనసాగుతూనే ఉన్నది. గత వారం రోజులుగా పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలను పెంచుతూ వస్తున్న దేశీయ చమురు కంపెనీలు సామాన్యుల జేబులను గుల్ల చేస్తున్నాయి. నిన్న లీటర్‌కు 20 నుంచి 34 పైసలు పెంచిన కంపెనీలు తాజాగా పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌పై 29 పైసలు భారం మోపాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ.88.99కు చేరగా, డీజిల్‌ ‌ధర రూ.79.35కు పెరిగింది. ఇక దేశంలోనే అత్యధిక ధరలు ఉన్న జైపూర్‌లో పెట్రోల్‌ ‌రూ.95.51కి, డీజిల్‌ ‌రూ.87.76, ముంబైలో పెట్రోల్‌ ‌రూ.95.46, డీజిల్‌ ‌రూ.86.34కు చేరాయి.

హైదరాబాద్‌లో లీటర్‌ ‌పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు రూ.92.53, రూ.86.23గా ఉన్నాయి. పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరల పెంపును నిరసిస్తూ ఒడిశాలో రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ ‌కొనసాగుతోంది. ఆరు గంటలు రైల్‌ ‌రోకోతో పాటు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది కాంగ్రెస్‌ ‌పార్టీ. ప్రైవేట్‌ ‌ట్రాన్స్ ‌పోర్ట్ ‌వెహికల్స్ ‌తో పాటు ఆర్టీసీ స్వచ్ఛందంగా బంద్‌ ‌లో పాల్గొంటోంది. వ్యాపారసంస్థలు కూడా స్వచ్ఛందంగా షాపులు మూసేశాయి. బంద్‌ ‌తో రవాణా సౌకర్యం లేక జనాలు ఇబ్బంది పడుతున్నారు.

Leave a Reply