Take a fresh look at your lifestyle.

ఉభయ సభల్లో ‘పెట్రో’ మంటలు ..!

  • చమురు ధరల పెరుగుదల పై ప్రతిపక్షాల పట్టు
  • రికార్డు స్థాయిలో ధరలు పెరగడంపై ఆగ్రహం
  • సమావేశాలు నేటికీ వాయిదా

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ:రెండో రోజు కూడా పార్లమెంట్‌లోహొ పెట్రో మంట రేగింది. నిత్యావసర ధరల పెరుగుదలపై ఉభయ సభలు దద్దరిల్లాయి. కేంద్రంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి.వాయిదాల పర్వంలో పార్లమెంట్‌ ఇరుసభలు గడిచాయి. కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్‌లో పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌వంట గ్యాస్‌ ‌సెగ తగిలింది. ధరలు పెద్ద ఎత్తున పెరుగుతున్న నేపథ్యంలో ఉభయ సభల్లో ప్రతిపక్ష పార్టీలు మోడీ సర్కారుపై దండెత్తాయి. ధరలు పెరుగుదలకు కారణమైన బీజేపీ ప్రభుత్వ విధానాలపై ప్రతి పక్షాలు ప్రశ్నిచటంతో పార్లమెంట్‌ ఉభయ సభలు దద్దరిల్లాయి. గత ఆరేండ్ల కాలంలో బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ సర్కారు, పెట్రోలు, డీజిల్‌, ‌వంట గ్యాస్‌లపై పన్నులు, సెస్సుల రూపంలో 21 లక్షల కోట్ల రూపాయలు రాబట్టుకుందని, ఈ డబ్బంతా ఎక్కడకు వెళ్లిందనే దానిపై సభలో చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుపట్టారు. ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు వాయిదాలపై వాయిదా పడ్డాయి.

సభా కార్యక్రమాలు జరగకుండానే పార్లమెంట్‌ ఉభయ సభలు బుధవారంకి వాయిదా పడ్డాయి. అంతర్జాతీయంగా చమురు, వంట గ్యాస్‌ ‌ధరలు అతి తక్కువగా ఉన్నప్పటికీ, దేశంలో దినదినం పెరుగుతున్న చమురు, వంటగ్యాస్‌ ‌ధరలకు నిరసనగా పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు రెండో రోజు కూడా ఆందోళనకు దిగాయి. తొలుత లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ఇంధన ధరల అంశాన్ని లేవనెత్తారు. ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు. పెట్రో ధరలు తగ్గించాలి… దేశ ప్రజానీకాన్ని కాపాడాలంటూ నినాదాలతో హెరెత్తించారు. ప్రతిపక్షాల నిరసనల నడుమే లోక్‌సభలో ప్రశ్నోత్తరాలను స్పీకర్‌ ఓం ‌బిర్లా ప్రారంభించారు. ఇంధన ధరల పెరుగుదలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన చేశారు.

- Advertisement -

సభాపతి ఓంబిర్లా వారించినా వారు వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్యాహ్నాం 12 గంటలకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైనప్పటికీ, ఈ అంశంపై ప్రభుత్వం సభలో చర్చ చేయాలని ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి. అయితే, ప్రభుత్వం స్పందించకపోవడంతో పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. ప్రతిపక్షాల ఆందోళన కొనసాగించారు. దీంతో సభను మధ్యాహ్నాం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల నిరసనలతో దద్దరిల్లింది. ఈ నేపథ్యంలో లోక్‌సభను బుధవారానికి సభాపతి వాయిదా వేశారు. లోక్‌సభలో పెట్రోల్‌, ‌డిజిల్‌, ఎల్పీజీ ధరలు పెరుగుదలపై చర్చ చేపట్టాలని మనీష్‌ ‌తివారీ, కె. సురేష్‌ (‌కాంగ్రెస్‌), ఏఎం ఆరీఫ్‌ (‌సీపీఐ(ఎం), ఈటి మహ్మద్‌ ‌బషీర్‌ (ఐయూఎంఎల్‌), ఎన్కే ప్రేమ్‌ ‌చంద్రన్‌ (ఆర్‌ఎస్పీ), రితీష్‌ ‌పాండే (బీఎస్పీ), దయానిధి మారెన్‌ (‌డీఎంకే)లు వాయిదా తీర్మానం నోటీసులను ఇచ్చారు. అయితే స్పీకర్‌ ఓం ‌బిర్లా ప్రతిపక్ష సభ్యులిచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు.

రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. రాజ్యసభలోనూ ఆది నుంచి ఇదే అంశంపై గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌, ‌డీఎంకే, సీపీఐ(ఎం),సీపీఐ, బీఎస్పీ, శివసేనకు చెందిన ఎంపీలు పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌వంట గ్యాస్‌ ‌ధరల పెరుగుదలపై చర్చను చేపట్టాలని కోరుతూ వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. రికార్డు స్థాయిలో ధరలు పెరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు తగ్గించాలని నినాదాల హోరెత్తించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. డిప్యూటీ చైర్మన్‌ ‌హరివంశ్‌ ‌నారాయణ సింగ్‌ ‌మాట్లాడుతూ 267 రూల్‌ ‌కింద పెట్రోల్‌, ‌డీజిల్‌, ఎల్పీజీ, నిత్యావసర వస్తువల ధరలు పెరుగుదలపై పై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ‌ఖర్గే, సతీష్‌ ‌చంద్ర మిశ్రా (బీఎస్పీ), తిరుచ్చి శివ (డీఎంకే),హొ ప్రియాంక చతుర్వేది (శివసేన) నుండి నోటీసులు వచ్చాయి. అయితే నోటీసులను చైర్మన్‌ ‌తిరస్కరించారని, అందువల్ల తన నిర్ణయాన్ని మార్చలేనని వైస్‌ ‌ఛైర్మన్‌ అన్నారు. చమురు ధరలపై చర్చ జరపాలంటూ ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్‌ ‌చేయడంతో సభ 12 గంటలకు వాయిదా పడింది. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైనా, ప్రతిపక్షాల నిరసనలు కొనసాగడంతో మళ్లీ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో అదే గందరగోళం నెలకొనడంతో సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ వైస్‌ ‌చైర్మన్‌ ‌హరివంశరాయ్‌ ‌వెల్లడించారు.

Leave a Reply