Take a fresh look at your lifestyle.

సంస్థ బలోపేతానికి వ్యక్తిగత ఆశయాలను అధిగమించాలి

  • పార్టీలో క్రమశిక్షణ, ఐక్యత తప్పనిసరి
  • సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్‌ అ‌గ్రనేతల సమావేశం

సంస్థను బలోపేతం చేయాలంటే వ్యక్తిగత ఆశయాలను అధిగమించాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. క్రమశిక్షణ, ఐక్యత ఆవశ్యకతను ఆమె నొక్కి చెప్పారు. వొచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహాన్ని రూపొందించడానికి ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జ్‌లు, ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుల సమావేశానికి అధ్యక్షత వహించిన ఆమె, కేంద్ర ప్రభుత్వం యొక్క మితిమీరిన చర్యలతో బాధితుల కోసం పార్టీ తన పోరాటాన్ని రెట్టింపు చేయాలని అన్నారు. కీలక సమస్యలపై పార్టీ సందేశాలు అట్టడుగు స్థాయి కార్యకర్తలకు చేరకపోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకులలో కూడా స్పష్టత, ఐక్యత లోపించిందని ఆమె ఆవేదన వ్యక్తం అన్నారు. పార్టీ కొత్త సభ్యత్వ డ్రైవ్‌కు సంబంధించిన వ్యూహాన్ని రూపొందించడానికి, దానికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడానికి నాయకులు కూడా కలిసి వొచ్చారు.

ఈ డ్రైవ్‌ ‌నవంబర్‌ 1 ‌నుండి ప్రారంభమవుతుంది మరియు వొచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగుతుంది. మనలో ప్రతి ఒక్కరికీ ముఖ్యమైనది ఏమిటంటే సంస్థను బలోపేతం చేయడమని, దీనికి వ్యక్తిగత ఆశయాలను అధిగమించాలని, ఇందులో సమష్టి, వ్యక్తిగత విజయం రెండూ ఉన్నాయని సోనియా గాంధీ అన్నారు. పార్టీ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలను నొక్కిచెప్పిన కాంగ్రెస్‌ ‌చీఫ్‌, ‌దానిని ప్రాధాన్యతపై చేపట్టాలని అన్నారు. మన ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని, కాంగ్రెస్‌ ‌పార్టీ సిద్ధాంతాలను రక్షించే పోరాటం అసత్య ప్రచారాలను గుర్తించడానికి, ఎదుర్కునడానికి పూర్తిగా సిద్ధంగా ఉండటంతో ప్రారంభమవుతుంది. మనం బిజెపి/ఆర్‌ఎస్‌ఎస్‌ల దుష్ప్రచారాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కునాల్సిందిగా, మనం ఈ యుద్ధంలో గెలవాలంటే నిశ్చయంతో చేయాలని, ప్రజల ముందు వారి అబద్ధాలను బహిర్గతం చేయాలని ఆమె అన్నారు.

దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై ఏఐసిసి దాదాపు ప్రతిరోజూ ముఖ్యమైన, వివరణాత్మక ప్రకటనలను విడుదల చేస్తుందని సోనియా గాంధీ పేర్కొన్నారు. కానీ అవి బ్లాక్‌, ‌జిల్లా స్థాయిలో, గ్రాస్‌ ‌రూట్‌ ‌క్యాడర్‌లకు చేరడం లేదనేది తన అనుభవమని, విధానపరమైన సమస్యలు ఉన్నాయని, తమ రాష్ట్ర స్థాయి నాయకులలో కూడా స్పష్టత మరియు ఐక్యత లోపాన్ని తాను గుర్తించానని అన్నారు. మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, దేశంలోని సంస్థలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిందని, తద్వారా జవాబుదారీతనం నుండి తప్పించుకోవచ్చని మరియు మన రాజ్యాంగం యొక్క ప్రధాన విలువలను అణగదొక్కాలని ప్రయత్నించిందని ఆమె అన్నారు. ఇది మన ప్రజాస్వామ్య మౌలికాంశాలను ప్రశ్నిస్తుందని ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వ అతి దారుణమైన దుష్పరిణామాలకు బాధితులైన వారి కోసం మనం మన పోరాటాన్ని రెట్టింపు చేయాలని, మన రైతులు మరియు రైతు కూలీలు, ఉద్యోగాలు మరియు అవకాశాల కోసం పోరాడుతున్న మన యువత, చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలు, మన సోదరులు, సోదరీమణులు అణగారిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె నొక్కి చెప్పింది.

ఐదు రాష్ట్రాల ఎన్నికలపై మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలతో విస్తృత చర్చల నుండి వెలువడే నిర్దిష్ట విధానాలు మరియు కార్యక్రమాలపై తమ ప్రచారం తప్పనిసరిగా స్థాపించబడాలని కాంగ్రెస్‌ ‌నాయకులు అన్నారు. పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ‌గోవా, మణిపూర్‌ ‌రాష్ట్రాల్లో వొచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమావేశానికి పార్టీ మాజీ చీఫ్‌ ‌రాహుల్‌ ‌గాంధీ ఇతర  కాంగ్రెస్‌ ‌నేతలు హాజరయ్యారు.

Leave a Reply