Take a fresh look at your lifestyle.

‌గ్రానైట్‌ ‌క్వారీలో వ్యక్తి మృతి

Person, killed, granite quarry, errabelli village, tractor driver
‌ప్రమాదంలో మృతి చెందిన రాజు

మండలంలోని ఎర్రబెల్లి గూడెం గ్రామ శివారులోని గ్రానైట్‌ ‌క్వారీలో కంప్రెషర్‌ ‌ట్రాక్టర్‌ అదుపుతప్పి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ఎర్రబెల్లిగూడెం గ్రామానికి చెందిన గుండెబోయిన రాజు (32) గ్రానైట్‌ ‌క్వారీలో మేస్త్రీ వద్ద కటింగ్‌ ‌కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం గ్రానైట్‌ ‌కు చేరుకున్న అతను పనులకు వెళ్లగా అక్కడే ఉన్న కంప్రెషర్‌ ‌ట్రాక్టర్‌ ‌ను ముందుకు తీసుకువెళ్లే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ ‌కందుల ఫణిదర్‌ ‌హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

అనంతరం భార్య మహేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రి మహబూబాబాద్‌ ‌కు తరలించినట్లు తెలిపారు. మృతుడికి భార్య మహేంద్ర, ఇద్దరు కుమారులు సాయికుమార్‌ ‌శ్రీకాంత్‌ ఉన్నారు. మృతుడి భార్య రోదనలు అందరినీ కన్నీటి పర్యంతం చేశాయి. స్థానిక సర్పంచ్‌ ‌బొమ్మెర అశోక్‌ ‌గౌడ్‌, ఎం‌పిటిసి బత్తిని అనిల్‌ ‌గౌడ్‌, ‌పీఏసీఎస్‌ ‌చైర్మన్‌ ‌పొనుగోటి రామారావు, టిఆర్‌ఎస్‌ ‌గ్రామ అధ్యక్షుడు భూముల శ్రీనివాస్‌ ‌మృత దేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.

Tags: Person, killed, granite quarry, errabelli village, tractor driver

Leave a Reply