Take a fresh look at your lifestyle.

పట్టుదల, క్రమశిక్షణతో శ్రమిస్తే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి

District Collector Sridhar at a seminar for tenth grade students
పదవ తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్‌ ‌శ్రీధర్‌

పదో తరగతి పరీక్షల్లో వసతి గృహాల విద్యార్థులు వందశాతం ఫలితాలు సాధించేందుకు వార్డెన్లు, గైడ్‌ ‌టీచర్స్ ‌కృషి చేయాలని కలెక్టర్‌ ఇ.‌శ్రీధర్‌ ‌పిలుపునిచ్చారు. నాగర్‌ ‌కర్నూల్‌ ‌పట్టణంలోని సుఖ జీవన్‌ ‌రెడ్డి ఫంక్షన్‌ ‌హాల్లో బుధవారం జిల్లా లోని సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల 60 సంక్షేమ వసతిగృహాల 1350 మంది పదో తరగతి విద్యార్థులకు ఒకరోజు శిక్షణ, అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్‌ ‌శ్రీధర్‌ ‌మాట్లాడుతూ పట్టుదల, క్రమశిక్షణతో శ్రమిస్తే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని అన్నారు. పదోతరగతి భవిష్యత్తుకు ముఖ్యమైన మలుపు అన్నారు. పరీక్షలకు 35 రోజులు గడువు మాత్రమే ఉందని, విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదువుకోవాలని సూచించారు. లక్ష్యసాధనకు ప్రతి నిమిషం శ్రమించాలన్నారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్ధేశించుకొని ఆ దిశగా ముందడుగు వేయాలని కలెక్టర్‌ ‌విద్యార్థులకు సూచించారు. పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలంటే భయం వద్దని సూచించారు. చదువుకోకపోతే, పాఠశాలల్లో ఉపాధ్యాయులు చెప్పింది అర్థం కాకపోతే భయం ఉంటుందని, విషయం అర్థమైతే రాయడం సులువని అన్నారు. ఉపాధ్యాయుడు చెప్పే పాఠాలను అర్థం చేసుకోవాలని, ప్రతిరోజు చిన్న చిన్న పరీక్షలు రాస్తే నమ్మకం ఏర్పడుతుందన్నారు.పదో తరగతిలో పది జీపీఏ సాధించాలని సూచించారు. ఆత్మనూన్యత భావంతో ఉండరాదని, చేసే పనిలో పూర్తిగా నిమగ్నమైతే విజయం సాధ్యమని అన్నారు. పరీక్షలకు కేవలం మిగిలి ఉన్న రోజులను వృధా చేయకుండా ప్రతి సబ్జెక్టుపై దృష్టి సారించి, బాగా చదవాలని, రోజువారీ ప్రణాళికను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. తాను వసతి గృహం లోనే ఉండి ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని గుర్తు చేశారు.పట్టుదలతో సాధిస్తే అనుకున్న లక్ష్యాన్ని ఛేదించే వచ్చని విద్యార్థులకు పరీక్షల్లో ఎలా రాయాలో పలు విలువైన సూచనలు సలహాలు అందజేశారు.

చదువు తపస్సు లాంటిదని, కష్టపడి కాకుండా ఇష్టపడి చదువాలన్నారు. ప్రతి విద్యార్థికి పదో తరగతి కీలకమని, బాగా చదివి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమాధికారి అఖిలేష్‌ ‌రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్‌ ‌ప్రకాష్‌, ఎఎస్‌డబ్ల్యూఓలు, 60 వసతిగృహ సంక్షేమాధికారులు, నిష్ణాతులైన సబ్జెక్టు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply