Take a fresh look at your lifestyle.

ఇం‌డస్ట్రియల్‌ ‌పాలసీతో 15 రోజుల్లో అనుమతులు

ఇప్పటికే 17,500 పరిశ్రమలకు అనుమతులిచ్చాం మంత్రి కెటిఆర్‌
టీఎస్‌ ఐపాస్‌ ‌ద్వారా ఇండస్ట్రియల్‌ ‌పాలసీ తీసుకొచ్చామని, దీని ద్వారా 15 రోజుల్లో అనుమతులు లభిస్తాయని మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. శనివారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ..ఇప్పటి వరకు 17,500 పరిశ్రమలకు అనుమతులిచ్చామని చెప్పారు. రాష్ట్రానికి రూ.2,30,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించామని పేర్కొన్నారు.

మరిన్ని పెట్టుబడులు రావడానికి చాలా ఉపయోగపడుతుందన్నారు. ఐఏఎంసీకి అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని కేటీఆర్‌ ‌తెలిపారు. పారిశ్రామికీకరణలో దేశంలో తెలంగాణ ముందు ఉందని మంత్రి కెటిఆర్‌ ‌తెలిపారు. పరిశ్రమలు స్థాపనను సులభతరం చేసేందుకే టిఎస్‌ ఐపాస్‌ ‌తెచ్చామన్నారు. ఈ నెల 18 నుంచి ఇంటర్‌ ‌నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ ‌వి•డియేషన్‌ ‌సెంటర్‌ ‌పని చేస్తుందని, తెలంగాణ ప్రభుత్వం ఈ సెంటర్‌కు పూర్తి సహకారం అందిస్తుందన్నారు.

Leave a Reply