Take a fresh look at your lifestyle.

నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలకు అనుమతులు

  • బంజారాహిల్స్, ‌జూబ్లీ హిల్స్‌లో బహుళ అంతస్థులు
  • డి-9 గ్యాంగ్‌ ‌పనేనంటూ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ఆరోపణలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12 : ‌నిబంధనలకు విరుద్ధంగా గతంలో ఎప్పుడూ లేనంత అక్రమంగా..బంజారాహీల్స్, ‌జూబ్లీహీల్స్ ‌ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని, దీంతో బహుళ అంతస్థుల భవనాలు లేచాయని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. ప్రత్యేక నిబంధనలు ఉన్నా వాటిని కాదని నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. కేబీఆర్‌ ‌పార్క్ ‌దగ్గర నిర్మాణాలకు కూడా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని చెప్పారు. అందుకే పార్క్ ‌చుట్టూ కమర్షియల్‌ ‌కాంప్లెక్స్‌లు తక్కువగా ఉన్నాయని వెల్లడించారు. కేసీఆర్‌ ‌వొచ్చాకే కేబీఆర్‌ ‌పార్క్ ‌చుట్టూ నిర్మాణాలు పెరిగాయన్నారు. బీసీ స్టడీ సర్కిల్‌ ‌సెంటర్‌ ‌దగ్గర నిజాం హెరిటేజ్‌ ‌బిల్డింగ్‌ ఉం‌డేదని..దాన్ని నిబంధనలకు విరుద్ధంగా కూలగొట్టారని ఆరోపించారు. హెరిటేజ్‌ ‌బిల్డింగ్‌ను కుర్రా శ్రీనివాస రావు అనే వ్యక్తి కొన్నారని వెల్లడించారు. శ్రీనివాస రావుకు అనుమతుల కోసం కొంత భూమిని అడిగారని ఆరోపించారు. గ్రీన్‌జోన్‌లో ఉన్న వారసత్వ బిల్డింగ్‌ ‌ను కూలగొట్టి కొత్త నిర్మాణాలకు పర్మిషన్‌ ఇచ్చారని ఆరోపించారు.

గ్రీన్‌ ‌జోన్‌లో కొత్త నిర్మాణానికి ఎలా అనుమతిస్తారని నిలదీశారు. రూల్స్ ‌విరుద్ధంగా కొత్త భవనానికి అనుమతిచ్చారని ఆరోపించారు. 5 అంతస్తుల భవనానికి పర్మిషన్‌ ఇవ్వని చోట..21 అంతస్తులకు పర్మిషన్‌ ఇచ్చారని తెలిపారు. 3 వేల గజాల స్థలంలో 21 అంతస్థులకు ఎలా పర్మిషన్‌ ఇచ్చారని ప్రశ్నించారు. పక్కనే ఉన్న బసవతారకం హాస్పిటల్‌కి 3 అంతస్తుల కంటే ఎక్కువ పర్మిషన్‌ ఇవ్వలేదన్నారు. ఏడుగురు ఐఏఎస్‌లు, ఇద్దరు తండ్రీ కొడుకులు కలిసి డీ 9 గ్యాంగ్‌గా మారారని విమర్శించారు. 20 శాతం భూములు రాసిచ్చిన వారికే నిర్మాణాలకు అనుమతిచ్చారని రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. 21 అంతస్థుల అపార్ట్ ‌మెంట్‌ ‌వల్ల  కేబీఆర్‌ ‌పార్క్ ‌దగ్గర భారీగా ట్రాఫిక్‌ ‌సమస్యలు వొస్తాయన్నారు. కేసీఆర్‌ ‌దుర్మార్గపు పాలనకు ఇది పరాకాష్ట అని..వి• చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఇంత విధ్వంసం సృష్టిస్తారా అని మండిపడ్డారు రేవంత్‌. ‌సింగపూర్‌ ‌మలేషియాల మాదిరిగా ఇక్కడ భవనాలు కట్టడం కాదని..వి•రు అక్కడికే వెళితే ఇక్కడి ప్రజలు సుఖశాంతులతో ఉంటారని ఎద్దేవా చేశారు.

Leave a Reply