Take a fresh look at your lifestyle.

కుండలు అమ్ముకొవడానికి అనుమతి ఇవ్వాలి బిసి సంఘం కన్వీనర్‌ ‌రాజ్‌ ‌కుమార్‌

‌తాండూరు : కుమ్మరులు కుండలు అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ బీసీ సంఘం నియోజకవర్గం కన్వీనర్‌ ‌రాజ్‌ ‌కుమార్‌ ఆర్డీవోకు విజ్ఞప్తి చేశారు. గురువారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవోకు ఈ మేరకు ఆయన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొరోనా మహమ్మారి లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల కుమ్మరి కులస్తులు కుండలు అమ్ముకోలేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

- Advertisement -

తాండూర్‌ ‌పరిస• ప్రాంతాలై•న దస్తగిరిపేట్‌, ‌జకాయిపల్లి, మంబాపూర్‌, ‌పెద్దేముల్‌లో దాదాపుగా 100 పైగా కుమ్మరి కుటుంబాలు కులవృత్తి పైనే ఆధారపడి ఉన్నారని అన్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విక్రయించడానికి అనుమతి ఇవ్వాలని ఆర్డిఓ వేణు మాధవ రావుకు వినతి పత్రంలో తెలిపారు.

Leave a Reply