Take a fresh look at your lifestyle.

పెళ్లిళ్లకు తహశీల్దార్ల అనుమతి తప్పనిసరి

నేటి నుంచి నిబంధనలు అమలు

‌తెలంగాణలో వివాహాలకు తహశీల్దార్ల అనుమతి తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెళ్లిళ్లకు అనుమతులు ఇచ్చే బాధ్యత మండల పరిధిలోని తహశీల్దార్లకు అప్పగిస్తూ జీవో జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొరోనా తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్న దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. శ్రావణమాసం మొదలైన మంగళవారం నుంచి ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయి. శ్రావణమాసంలో పెళ్లిళ్లు పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంటుంది. పెళ్లిళ్లకు భారీ సంఖ్యలో అతిధులు హాజరైన పక్షంలో కొరోనా వేగంగా విస్తరించే ప్రమాదం ఉంది. దీంతో వివాహానాకి కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యేలా నిబంధన విధించింది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుతో కలిపి ఇంతకు మించిన సంఖ్యలో హజరు కావొద్దనీ, అలాగే, పెళ్లి అనుమతి కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి వివాహానికి హాజరయ్యే 20 మంది అతిధుల వివరాలతో పాటు పెళ్లి కార్డు, ఆధార్‌ ‌కార్డు, కొరోనా రిపోర్టులతో పాటు రూ. 10 నాన్‌ ‌జ్యుడీషియల్‌ ‌స్టాంపుపై అఫిడవిట్‌ను తహశీల్దార్‌కు అందించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పాటించని వారిపై జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Leave a Reply