గ్రామ యువకులు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి ఆ చిన్నారులు మేము సైతం అంటూ ముందుకు వచ్చారు…గ్రామానికి చెందిన పేద కుటుంబానికి తమ వంతు సహాయ పడాలనుకున్నారు. ఆలోచన వచ్చిందే తడువు డబ్బా పట్టుకుని ఇంటింటికి తిరిగారు..చిన్నా పెద్దా తేడా లేకుండా అందరి ఇండ్ల వద్దకు వెళ్లారు..వారు అడుగుతున్న సహాయానికి చలించిన గ్రామస్తులు తమ వంతుగా సాయం చేశారు.మండలంలో ని గౌరవరం గ్రామానికి చెందిన కొంత మంది యువకులు బ్యూటీ ఫుల్ లైఫ్ అసోసియేషన్ అనే స్వచ్చంద సంస్థ ఏర్పాటు చేసి ఆనార్తులకు ఆకలి భాధలతో పాటు నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటూ పలువురి తో సాయం చేపిస్తున్నారు.. వీరి సేవలు •క విదంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలలోనే మంచి గుర్తింపు వచ్చింది.
గౌరవరం గ్రామానికి చెందిన కల్లూరి పంగీత అనే వివాహిత మహిళ రోడ్డు ప్రమాదానికి గురై మంచానికే పరిమితం అయింది. ఆమె ఆర్దిక ఇబ్బందులు గుర్తించిన బిఎల్ఏ నిర్వహకులు తమ వంతు గా సహాయం చేయడంతో పాటు ఇతరులచే సాయం అందించే విదంగా కృషి చేశారు. దీనిని గమనించిన గ్రామానికి చెందిన ఎనిమిది నుండి 13 సంవత్సరాలు బాల, బాలికలు సాయం చేయడం లో మేమంటూ మందుకు వచ్చారు. డబ్బా చేత పట్టి గ్రామంలో ని ఇంటింటికి తిరుగుతూ డబ్బులు సేకరించారు. సేకరించిన డబ్బులను బిఎల్ఏ నిర్వహకుల సమక్షంలో బాదిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఏ ఉపాద్యక్షుడు కణితి రాజు, కార్యనిర్వాహక సభ్యుడు నాగరాజు, పిల్లలు లోహిత్, రంజిత్, వెంకట్, శ్యామల, రిషి, రాకేష్, నాగార్జున, ప్రీతి తదితరులు ఉన్నారు.