Take a fresh look at your lifestyle.

ప్రజాస్వామ్య పండుగను పరిపూర్ణం చేయండి

చివరిదశ ఎన్నికల సందర్భంగా మోడీ వినతి
ఎన్నికలను ప్రజాస్వామ్యం పండుగగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్‌ ‌శాసన సభ ఎన్నికల్లో ఎనిమిదో దశ పోలింగ్‌ ‌గురువారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఓటర్లకు ఓ విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌-19 ‌మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్లు వేయాలని, ప్రజాస్వామ్యం పండుగను సుసంపన్నం చేయాలని కోరారు. ఈ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్‌ ‌గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 35 శాసన సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ ‌జరుగుతోంది.

ఈ నేపథ్యంలో మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, పశ్చిమ బెంగాల్‌ ‌శాసనసభ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్‌ ‌జరుగు తోందని, కోవిడ్‌-19 ‌మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్లు వేయాలని, ప్రజాస్వామ్యం పండుగను పరిపుష్టం చేయాలని పిలుపునిచ్చారు. పోలింగ్‌ ‌ప్రశాంతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన భద్రత చర్యలు అమలవుతున్నాయి. గురువారం ఉదయం 11 గంటల వరకు 37.80 శాతం ఓట్లు పోలైనట్లు సమాచారం. మొత్తం ఎనిమిది దశల్లో పోలైన ఓట్లను మే 2న లెక్కిస్తారు.

Leave a Reply