Take a fresh look at your lifestyle.

ఇలాగే నిర్బంధం కొనసాగితే ప్రజలు తిరుగబడుతారు…సిఎల్పీ  

# కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్ లు…

# సచివాలయ ముట్టడికి పిలుపునివ్వలేదు…భట్టి
# సీఎం పేషీ ఎక్కడ ఉందొ తెలియదు …జగ్గారెడ్డి
# ప్రజాసమస్యల పై పోరాడితే అరెస్ట్ చేస్తారా ..కోమటిరెడ్డి
ప్రభుత్వం దుర్మార్గమైన పాలన చేస్తుందని శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు .అడ్డగోలు గా విద్యుత్ బిల్లులు , నియంతృత్వ వ్యవసాయ విధానం, కరోనో విషయంలో ముఖ్యమంత్రి తో కలిసి చర్చించేందుకు అపోయింట్మెంట్ అడిగామని ,వ్యవసాయ శాఖ మంత్రి ఉదయం 10 గంటలకు రమ్మని చెప్పారని తెలిపారు .మంత్రి  మాట్లాడేందుకు పిలిచారు కానీ ఇక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు .ఇదేమి పాలన ఇంత సమాచార లోపం ఉంటే ఎలా అని ప్రశ్నించారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ,సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ,ఎమ్మెల్యే లు జగ్గారెడ్డి ,శ్రీధర్ బాబు ,ఎంపీ లు రేవంత్ రెడ్డి ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇతర నేతలను హౌస్ అరెస్ట్ చేశారు .ఈ సందర్భంగా భట్టి  విక్రమార్క ఒక వీడియో విడుదల చేశారు .ఈ వీడియో  లో మాట్లాడుతూ….మేము సచివాలయం ముట్టడికి పిలుపు ఇవ్వలేదని పోలీసులకు కనీస సమాచారం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని ఇంత అనాలోచిత పాలన ఎక్కడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.మేము ప్రజల పక్షాన మాట్లాడుతుంటే పాలకులు నిర్బంధం కొనసాగిస్తున్నారని ,ఇలాగే నిర్బంధం కొనసాగితే ప్రజలు తిరగబడుతారని హెచ్చరించారు.ఒక ప్రజాప్రతినిది హోదాలో సెక్రటేరియట్ వెళ్లి వినతి పత్రం ఇవ్వడం నా హక్కని ఇవ్వాళ నన్ను అడ్డుకొని నా హక్కులను అడ్డుకోవడమే కాకుండా నన్ను అవమానించారని మండిపడ్డారు.నాకు రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని , నా హక్కులను-భాధ్యతను అడ్డుకున్న వారికి అసెంబ్లీ లో ప్రివిలేజ్ మోషన్ ఇస్తామన్నారు.అసెంబ్లీలో లో నాకు న్యాయం జరగకపోతే న్యాయ పరంగా పోరాటం చేస్తాను-న్యాయస్థానానికి వెళ్తానన్నారు.

Leave a Reply