Take a fresh look at your lifestyle.

చంద్రబాబు మాటలు ఇక ప్రజలు నమ్మరు

అమరావతి,సెప్టెంబర్‌ 22 : ఆం‌ధప్రదేశ్‌ ‌పరిషత్‌ ఎన్నికల ఫలితాల అనంతరం విపక్షాల్లో గుబులు మొదలయ్యిందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ‌పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మే స్థితిలో లేరని, అందుకే నిమ్మకూరు, నారావారిపల్లేలో ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి కి జై కొట్టారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ మినహా రాష్ట్రంలో మిగతా పార్టీలకు చోటు లేదని ప్రజలు మరో సారి రుజువు చేశారు. మాటల మనిషి కాదు చేతల మనిషి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

అందుకు నిదర్శనమే పరిషత్‌ ఎన్నికల ఫలితాలు. రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తోంది. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అమరావతి పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. ఆయన గ్రాఫిక్స్‌ను ప్రజలు నమ్మలేదు. అందుకే పరిషత్‌ ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. పరిషత్‌ ఎన్నికల ఫలితాల్లో 80శాతం పైగా ఓట్లు మాకు వచ్చాయి. ఫలితాల తర్వాత ఇప్పుడు మేము బహిష్కరించాం అని జబ్బలు చరుచుకుంటున్నారని వెల్లంపల్లి విమర్శించారు. చంద్రబాబు, లోకేష్‌ని మేము ప్రవాస ఆంధ్రులని అనుకుంటున్నాం. ఒక గెస్ట్ ‌లాగా ఏపీకి వచ్చి గెస్ట్‌హౌస్‌లో ఉండి వెళతారు.

సొంత కొడుకును చిత్తుగా ఓడించారని ప్రజల ద చంద్రబాబుకు కోపం. ఫామ్‌హౌస్‌లలో కూర్చున్న వారు కూడా మాదక ద్రవ్యాల గురించి మాట్లాడుతున్నారు. పోలీస్‌ ‌కమిషనర్‌ ‌కూడా స్పష్టం చేశారు.. అయినా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. డ్రగ్స్ ‌తీసుకున్న లక్షణాలు లోకేష్‌, ‌బోండా ఉమాలాంటి వారికే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. లేదంటే గంజాయి వ్యాపారం చేసిన అయ్యన్నకు ఈ లక్షణాలు ఉన్నాయేమో‘ అని వెల్లంపల్లి విమర్శించారు.

Leave a Reply