Take a fresh look at your lifestyle.

పల్లెలకు బయలుదేరిన ప్రజలు

  • సంక్రాంతికి కళకళలాడనున్న గ్రామాలు
  • ఏటేటా పందాలకు తగ్గని జోరు

ఏలూరు,జనవరి9 : సంక్రాంతి వస్తుందంటే  సొంతూరుకు ఎప్పుడు వెళదామా…కోడి పందాలు ఎప్పుడు జరుగుతాయా అని పలువురు ఎదురుచూస్తుంటారు. సంక్రాంతి పండుగ సంస్క•తిలో కోడి పందాలు భాగమయ్యాయి. పండుగ మూడు రోజులు పందెంరాయుళ్ల హడావుడి అంతాఇంతా కాదు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో కోడి  పందాలకు సన్నద్ధమవుతున్నారు.  గ్రామాల్లో కుటుంబం, బంధువుల సమక్షంలో కోడి పందాలు వేసుకునేందుకు ఇప్పటి నుంచే పలువురు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పందాలకు జిల్లావాసులే కాకుండా తెలంగాణరాష్ట్రం నుంచి కూడా పెద్దసంఖ్యలో పందెంరాయుళ్లు తరలివస్తుంటారు. అయితే ఆ పండుగకు ఐదు నెలల ముందు నుంచే పందెం కోళ్లను సిద్ధం చేస్తారు.

పండుగకు మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఇప్పటి నుంచే కోడి పందాలు చూసే వారితో పాటు.. నిర్వహించేవారు.. పందాలు కాసేవారు కూడా ఉత్సుకతతో నిరీక్షిస్తున్నారు. అయితే ఇప్పటికే దేశంలో కరోనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్టాల్రకు సూచించింది. అయితే  వివిధ రకాల జాతుల కోడిపుంజులను లక్షలు పెట్టి కొనుగోలు చేస్తారు. అదే స్థాయిలో వాటికి బలవర్ధకమైన ఆహారం అందజేస్తారు. అంతేగాక వాటికి ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తుంటారు. బరిలో నిలిచేప్పుడు పుంజులు తొందరగా అలిసిపోకుండా ఎంతసేపైనా ప్రత్యర్థి పుంజును ఢీకొనేలా వాటికి శిక్షణ ఇస్తారు. ఒక్కో పుంజుకు రోజుకు వంద నుంచి రూ.700 వరకు ఖర్చు చేస్తారు. పందానికి తయారయ్యే పుంజులకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయలకు పైనే ఖర్చు చేస్తారు. పందెపు కోళ్లను తయారు చేయటంలో నిర్వాహకులు తీసుకునే జాగ్రత్తలు చూస్తే ఆశ్చర్యం చెందాల్సిందే.

ఇలా సిద్ధమైన ఒక్కో పుంజు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. పందాలు వేసే కోడి పుంజుల్లో తెల్ల నెమలి, కోడి నెమలి, గౌడ నెమలి, కాకి డేగ, నెమలి కక్కెర, నల్ల కక్కెర, రసంగి, గాజు కక్కురాయి, అబ్రాస్‌, ఎ‌ర్రడేగ వంటి జాతులు ఉంటాయి. నిత్యం కోళ్లకు బలమైన ఆహారంతో పాటు వ్యాయామం చేయించి సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తుందా, కోడి పందాలు ఎప్పుడు వేద్దామా అనే రీతిలో పుంజులను తయారు చేస్తారు. కోడి రంగు, జాతిని ఎంపిక చేసి ఆ రోజున ఏ పుంజుతో పందెం వేయాలో ప్రణాళికలు రూపొందించే పనిలో ప్రజలు నిమగ్న మయ్యారు. సంక్రాంతి పందాలకు ఏర్పాట్లు కోళ్లను సిద్ధం చేస్తున్న సంరక్షకులు పుంజులకు బలవర్ధకమైన ఆహారంతో పాటు శిక్షణ ఇచ్చి రెడీ చేస్తున్నారు. సంక్రాంతి.. అంటే రైతుల పండుగ.

సంక్రాంతి నెల ప్రారంభం నుంచి పల్లెల్లో సందడే సందడి. ముంగిళ్లు రంగవల్లులతో నిండిపోతుంది. అయితే కొందరికి మాత్రం పందాల సంబరం. ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తోన్న సంక్రాంతి పర్వదినం సపిస్తోంది. దీంతో పందెంరాయుళ్లు కోడి పందాలకు సిద్ధమవుతున్నారు. తీర ప్రాంతంలో బరులతో పాటు కోళ్లను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పందాల కోళ్లకు ప్రత్యేక శిక్షణ, ఆహారం అందజేస్తున్నారు. ఇలా సిద్ధమైన కోళ్ల కోసం పందెం రాయుళ్లు పోటీపడుతున్నారు. పండుగ మూడు రోజుల సమయంలో పందాలు భారీగా  వేసేందుకు తీరప్రాంత ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దూర ప్రాంతాల్లోని బంధువులు, స్నేహితులకు ఆహ్వానాలు కూడా పంపారు.

Leave a Reply