Take a fresh look at your lifestyle.

‌సామాజిక, భౌతిక దూరం పాటించని ప్రజలు

  • ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా జనం
  • చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు 

కరోనా వైరస్‌ ‌రోజు రోజు కు విజృంభిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ ‌కేసుల్లో భారత దేశం 4వ స్థానంలో ఉండటం చూస్తుంటే ఒక ప్రక్క భయమెస్తుంది. కరోనా వైరస్‌ ‌భారినపడకుండా ఉండాలంటే మనిషికి మనిషికి మధ్య 4ఫీట్ల దూరం, సామాజిక, భౌతిక దూరం పాటించి సబ్బుతో తరుచుగా చేతులను కడుక్కొని, బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ‌ధరించాలని వరల్డ్ ‌హెల్త్ ఆర్గనైజేషన్‌, ‌సెంటర్‌ ‌ఫర్‌ ‌డిసిస్‌ ‌కంట్రోల్‌, ‌వైద్య నిపుణులు చెప్తున్నా, ప్రజల్లో ఏమాత్రం భయం కనిపించడం లేదు. సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదు అయిన జిల్లాగా ఉండటంతో సూర్యాపేట జిల్లాను రెడ్‌జోన్‌గా ప్రకటిం చారు. గత 40రోజులుగా ఒక్క కరోనా పాజిటివ్‌ ‌కేసు కూడా నమోదు కాకపోవడంతో ఆరెంజ్‌ ‌జోన్‌గా ప్రకటించారు. అప్పటికే 83కరోనా పాజి టివ్‌ ‌కేసులు రాగా పూర్తిస్థాయిలో ప్రాణనష్టం జరగకుండా అందరూ డిశ్చార్జ్ ‌కావడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మళ్లీ మంగళవారం సూర్యాపేట మండల పరిధిలోని కాసరబాద గ్రామంలో 4నెలల బాబుకు కరోనా పాజిటివ్‌ ‌వచ్చి మరణించడంతో ప్రజల్లో భయాందోళన మళ్లీ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31వరకు లాక్‌డౌన్‌ ‌కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సడలింపులో భాగంగా ప్రజలు ఏమాత్రం సామాజిక, భౌతిక దూరం పాటించకుండా, కొంతమంది మాస్క్‌లను సైతం ధరించకుండా ఇష్టమోచ్చినట్లు గుంపులు గుంపులుగా ఉంటున్నారు.

మరి ముఖ్యంగా బ్యాంకుల వద్ద, వ్యాపార సంస్థల వద్ద ఎలాంటి శానిటైజర్లు, భౌతిక దూరం పాటించకుండా ప్రజలు కరోనాను స్వాగతం పలుకుతున్నట్లే ఉన్నది తప్ప నిర్మూలించేందుకు ఏమాత్రం మార్గదర్శకాలను మాత్రం పాటించడంలేదని డాక్టర్లు, మేధావులు అంటున్నారు. సెంట్రల్‌ ‌ఫర్‌ ‌డిసిస్‌ ‌కంట్రోల్‌ ‌మాస్క్, ‌భౌతిక దూరాన్ని పాటిస్తేనే తప్ప కరోనాను నియంత్రించలేమని చెప్తున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. రాష్ట్రంలో కరోనా లక్షణాలు లేకున్నా కరోనా పా జిటివ్‌ ‌రావడం ఆందోళన కల్గిస్తుంది. వైరస్‌ ‌సోకిన వ్యక్తి తగ్గినా, తుమ్మినా వారి నుండి వెలువడే తుప్పెర్లతో ఎక్కువగా వైరస్‌ ‌వ్యాప్తిచెందుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకప్రక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాతో సహజీవనం చేయవలసిందేనని ప్రకటించడంతోపాటు మరణాల సంఖ్య తక్కువేనని ప్రకటించడంతో ప్రజల్లో ఎలాంటి భయం లేకుండా ఇష్టాను సారంగా తిరుగుతున్నారు. లాక్‌డౌన్‌ ‌సడలింపుల్లో భాగంగా దేశ వ్యాప్తంగా సుమారు 1లక్ష 50వేల కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదు అయ్యాయి. సుమారు 4వేల వరకు మరణాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2వేల వరకు కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా అందులో 57మంది మరణించారు. ఇటీవల సూర్యాపేట నుండి రాష్ట్ర బిజెవైఎం అధికార ప్రతినిధి హైకోర్టులో సూర్యాపేట జిల్లాలో కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించడం లేదని పిల్‌ ‌దాఖలు చేసిన విషయం తెలిసిందే. విచారణ చేపట్టిన హైకోర్టు సూర్యాపేట జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించింది. జూన్‌ 4‌వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అందజేయాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. మరోప్రక్క రోజు రోజుకు కరోనా బాధితులు పెరుగుతున్నారు. ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్నా కూడా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తు న్నారని వాపోతున్నారు.

Leave a Reply