Take a fresh look at your lifestyle.

పజలు స్వీయ నియంత్రణ పాటించాలి : కలెక్టర్‌

మందమర్రి, మే 1, ప్రజాతంత్ర విలేఖరి : కరోనా వైరస్‌ ‌కట్టడి విషయంలో వైద్య సిబ్బంది అందించిన సేవలు, ప్రజలు స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించడం వల్ల జిల్లాలో వైరస్‌ ‌వ్యాప్తి నియంత్రణలో ఉందని జిల్లా కలెక్టర్‌ ‌భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ ‌క్యాంపు కార్యాలయంలో ట్రైనీ కలెక్టర్‌ ‌కుమార్‌ ‌దీపక్‌తో కలిసి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 70 నమూనాలు సేకరించి గాంధీ ఆసుపత్రికి పంపించగా 69 మందికి పరీక్షలు నెగెటివ్‌గా వచ్చాయని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు శ్వాసకోశ, దగ్గు, జలుబు వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యుల సిఫారసు లేఖ లేకుండా మెడికల్‌ ‌షాపులలో మందులు కొనుగోలు చేసే వారి పేరు, చిరునామా, మొబైల్‌ ‌నంబర్‌ ‌వివరాలు తప్పనిసరిగా నమోదు చేస్తూ రిజిస్టర్‌ ‌నిర్వహించాలని అన్నారు. ముత్తెరావుపల్లిలో ప్రతిఇంటి సభ్యులు వైద్య పరీక్షల నిమిత్తం నమూనాలు సేకరిం చడంతో పాటు ఎవరినీ గ్రామంలో రాకపోకలకు అనుమతించరాదని తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి నీరజ, ఆసుపత్రి పర్యవేక్షకులు అరవింద్‌, ‌జిల్లా సర్వేయలెన్స్ అధికారి బాలాజీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలి
రబీ సీజన్‌లో వరిధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 221 కేంద్రాలు ఏర్పాటు చేసి 3 వేల 296 మంది రైతుల వద్ద నుండి 26 వేల 218 మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ ‌భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ ‌క్యాంపు కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్లు వై.సురేందర్‌రావు, ఇలా త్రిపాఠి, ట్రైనీ కలెక్టర్‌ ‌కుమార్‌ ‌దీపక్‌తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ వరిధాన్యం కొనుగోలు చేసిన రైతులకు సంబంధించి నగదు వారి ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని, కొనుగోలు చేసిన ధాన్యంలో ఇప్పటి వరకు 17 వేల 652 మెట్రిక్‌ ‌టన్నులు రైస్‌మిల్లులకు తరలిం చడం జరిగిందని, మిల్లుల నుండి వేగవంతంగా గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, 24 గంటలు మిల్లులు నడుపుతూ వారికి కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!