Take a fresh look at your lifestyle.

లాక్ డౌన్ కి ప్రజలందరూ సహకరించాలి… సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్.

కరోనా వైరస్ ని నిర్ములించడానికి, లాక్ డౌన్ అమలు చేస్తున్నామని, దీనికై ప్రజలందరూ సహకరించాలని, సైబరాబాద్ సీ పీ సజ్జనార్ అన్నారు.సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లాక్ డౌన్ వల్ల అంతర్ రాష్ట్ర బార్డర్స్ మూసివేస్తున్నామని,ఆర్టీసీ బస్సులు అన్ని బంద్ చేయించామని ప్రజలెవరు ప్రయాణాలు ఏర్పాట్లు చేసుకోవద్దని తెలిపారు.ఎమర్జెన్సీ సేవలకు మాత్రమే అందుబాటులో ఉంటాయని,ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరూ బయటకు రాకుండా ఉండాలని అన్నారు.

ఎక్కడ 5 మంది కంటే గుమిగూడకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జీవో 45 లో ఉన్న ప్రతి అంశాన్ని కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు.పరీక్షలు అన్ని వాయిదా వేస్తున్నామని ఎవరూ ఆర్భాటాలు చేయవద్దని అన్నారు. రోడ్ మీద ఎక్కడ ఎలాంటి వాహనాలు నడవడానికి వీలు లేదని,అతిక్రమిస్తే వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6వరకు ఎవ్వరు బయట తిరిగినా కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు బయట తిరిగితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.

అన్ని దుకాణాలు, వ్యాపార సముదాయాలు, కార్యాలయాలు , పరిశ్రమలు, కర్మాగారాలు, వర్క్ షాపులు, గోదాములు మొదలైనవి మూసివేయబడినవని, పరికరాల తయారీ విభాగంలో అనుబంధ తయారీ సంస్థలు పని చేస్తున్నాయనన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణములు మరియు అనుబంధ సంస్థలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించి పనిచేయాలని, అన్నారు. ప్రభుత్వ సంస్థలు చేతులు శుభ్రపరుచుకుని సదుపాయాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు కౌంటర్ల వద్ద తప్పనిసరిగా మూడు అడుగుల సామాజిక దూరం పాటించే విధంగా, నడుచుకోని, కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనకు, సంబంధిత ప్రభుత్వ అధికారులతో ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply