కొరోనాను నియంత్రించేందుకు .. ప్రజలు సహకరించాలి: సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
- కొరోనాపై తాజా పరిస్థితులపై సిఎం సక్ష
- వివిధ అంశాలపై ఆరా తీసిన ముఖ్యమంత్రి
భారీగా విరాళాలు అందచేత
కరోనా నేపథ్యంలో తాజా పరిస్థితులను ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సక్షించారు. కరోనా కేసులు, లాక్డౌన్ తదితర సమస్యలపై ఆరా తీసారు. మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో సక్ష నిర్వహించారు. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్డౌన్ అమలు, ఇతర అంశాలపై సీఎం చర్చిస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. వైద్యారోగ్య శాఖ మంత్రి, అధికారులతో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సక్షలు నిర్వహించి, పరిస్థితులను తెలుసుకుంటున్నారు. కరోనాను నియంత్రించేందుకు ప్రజలందరూ సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. దీంతో రాష్ట్ర ప్రజలు స్వీయ నియంత్రణలో ఉంటున్నారు. ఇదిలావుంటే సమావేశానికి •ం మంత్రి మెహమూద్ అలీకి అనుమతి నిరాకరించారు. లోపలికి అనుమతి లేదని ప్రగతి భవన్ సిబ్బంది చెప్పడంతో ఆయన వెనక్కు వెళ్లిపోయారు. అయితే డీజీపీ మహేందర్ రెడ్డికి అనుమతి ఉండటంతో సమావేశానికి అనుమతించారు. కరోనా నేపథ్యంలో ప్రగతి భవన్లో సక్షా సమావేశం జరిగింది.
భారీగా అందుతున్న విరాళాలు
కరోనా వైరస్ నివారణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యల్లో భాగంగా సీఎం రిలీఫ్ ఫండ్ కు తమ వంతు సాయం అందిస్తున్నారు. అనేక మంది ప్రముఖులు, పలు సంస్థలు సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం భారీ ఎత్తున విరాళాలు అందించేందుకు ముందుకు వచ్చారు దాతలు. ఆసియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్టో్ర ఎంట్రాలజీ రూ.50 లక్షల విరాళం అందించారు. ఎఐజి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ డివిఎస్ రాజు దీనికి సంబంధించిన చెక్కును ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించారు. అరబిందో ఫార్మా మొత్తం 11 కోట్ల విలువైన నగదు, శానిటైజర్లు, మందులు విరాళంగా అందించారు.
రూ.7.5 కోట్ల నగదుకు సంబంధించిన చెక్కును అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి, డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి సిఎంకు అందించారు. రూ.2.5 కోట్ల విలువైన శానిటైజర్లను, రూ.ఒక కోటి విలువైన మందులను రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వనున్నట్లు ప్రకటించారు. గ్లాండ్ ఫార్మా ఒక కోటి రూపాయలను విరాళంగా అందించారు. దీనికి సంబంధించిన చెక్కును గ్లాండ్ ఫార్మా ఎండి శ్రీనివాస్ సాదు సిఎంకు అందించారు. నవభారత్ వెంచర్స్ రూ.2.5 కోట్ల విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ చైర్మన్ డి.అశోక్, సిఇవో వి.విక్రం ప్రసాద్, ఇ.డి. నిఖిల్ సిఎంకు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యాహ్న భోజనం వండే కార్మికులు మొత్తం రూ.2.65 కోట్ల విరాళం అందించనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్ ను మద్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల హనుమాండ్లు సిఎంకు అందించారు. విరాళాలు అందించిన దాతలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
మహేశ్ బ్యాంక్ 50 లక్షల విరాళం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ రూ. 50 లక్షలను విరాళంగా ప్రకటించింది. ఈ మొత్తాన్ని బ్యాంక్ ప్రతినిధులు చెక్కు రూపంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని కలిసి అందజేశారు. కరోనా వైరస్ నివారణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యల కోసం తమ వంతు చేయూతను అందిస్తున్నట్లు బ్యాంకు ప్రతినిధులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.