Take a fresh look at your lifestyle.

పారిశుద్ధ్య కార్యక్రమానికి ప్రజలు సహకారం అందించాలి

పారిశుద్ధ్య ర్యాలీ నిర్వహిస్తున్న కలెక్టర్‌, ‌కమిషనర్‌, ‌కాలనీలో మురికి కాల్వలను పరిశీలిస్తున్న దృశ్యం, కాల్వ దాటుతున్న కలెక్టర్‌, ‌కమిషనర్‌ ‌దృశ్య:
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమానికి ప్రజలు సహకారం అందించాలని కలెక్టర్‌ ‌రాజీవ్‌ ‌గాంధీ హనుమతు అన్నారు. బుధవారం 36వ డివిజన్‌ ‌కాజీపేట దర్గాలోని పలు కాలనీలలో మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌పమేలా సత్పీతితో కలిసి నీటి నిల్వల ప్రదేశాలు, కాల్వలను కలెక్టర్‌ ‌పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు పరిసరాల పరిశుభ్రత ఎంతగానో తోడ్పాటు అందిస్తుందన్నారు. దర్గా కాజీపేటలోని పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌ ‌సమీపంలో ఉన్న డ్రైన్లు పరిస్థితి, స్థితిగతులను, నీరు నిలిచి ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. తద్వారా దోమల ఉత్పతికి ఆస్కారం కూడా ఉన్నందున మురుగు కాల్వలలో ఎప్పటికప్పుడు చెత్త చెదారాన్ని, వినియోగించి పడవేసిన ప్లాస్టిక్‌ ‌కవర్లను తొలగించాలని ఆదేశించారు. కార్పొరేటర్‌ అబ్‌ ‌బక్కర్‌ ‌కలెక్టర్‌ ‌దృష్టికి పలు సమస్యలను తీసుకొచ్చారు.

సమస్యలు పరిష్కరించేందుకు రైల్వే అధికారులు, మున్సిపల్‌ అధికారులు సమన్వయంతో మాట్లాడుకుని కాల్వలలో మురుగునీటి నిల్వకాకుండా పరిష్కరించుటకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అక్కడి నుండే కలెక్టర్‌ ‌ఫోన్‌లో పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులతో చర్చించారు. సైడ్‌ ‌డ్రైన్లలోని నీటి నిల్వ లేకుండా చూడాలన్నారు. స్థానికంగా చెత్త చెదారాన్ని తొలగించాలన్నారు. దోమల నివారణకు అయిల్‌ ‌బాల్స్ ‌వేయడంతో పాటు కెమికల్స్‌ను కాల్వలలో పిచికారి చేయించాలన్నారు. వర్షాకాలంలో సీజనల్‌ ‌వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ ‌కార్పొరేటర్‌ అబుబక్కర్‌, ‌మున్సిపాలిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply