Take a fresh look at your lifestyle.

పండగల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కొరోనా వ్యాప్తికి కారణం కారాదు
డెల్టా వైరస్‌ ‌గాలి ద్వారా సోకుతుంది..ఇంటా, బయట మాస్క్ ‌ధరించాలి
రాష్ట్ర   ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీ‌నివాసరావు హెచ్చరిక

రాష్ట్రంలో వరుస పండుగల దృష్ట్యా ప్రజలు కొరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు సూచించారు. డెల్టా వేరియంట్‌ ‌వ్యాప్తిని ప్రభుత్వ సహకారంతో వ్యూహాత్మకంగా ఎదుర్కొంటున్నామని ఆయన పేర్కొన్నారు. మంగళవారం కోఠిలోని తన కార్యాలయంలో ఆయన వి•డియాతో మాట్లాడుతూ.. డెల్టా వేరియంట్‌ ‌వ్యాప్తి మరో రెండు నెలల వరకు కొనసాగుతుందని భావిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కొరోనా వ్యాప్తిని తక్కువ కాలంలో కట్టడి చేయగలిగామని, అందుల్లనే కొరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయన్నారు. కొరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు మోడల్‌గా నిలిచిందని శ్రీనివాస రావు అన్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, అలాంటి చోట్ల వైరస్‌ ‌కట్టడికి వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. కేసులు తక్కువగా ఉన్నప్పుడే వైరస్‌ ‌వ్యాప్తిని సులువుగా నియంత్రించగలమని అభిప్రాయపడ్డారు. ప్రజలంతా కోవిడ్‌ ‌నిబంధనలు పాటిస్తూ వైరస్‌ ‌వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని కోరారు.

డెల్టా వైరస్‌ ‌గాలి ద్వారా సోకుతుంది..ఇంటా, బయట మాస్క్ ‌ధరించాలి

డెల్టా వైరస్‌ ‌గాలి ద్వారా సోకుతుందని, ఇంటా, బయట మాస్క్ ‌ధరించాలని డి.హెచ్‌ ‌శ్రీనివాస్‌ ‌రావు హెచ్చరించారు. డెల్టా వెరియంట్‌ ‌ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. ఏప్రిల్‌ ‌నుండి నవంబర్‌ ‌వరకు మొదటి వేవ్‌ ‌జరిగిందని చెప్పారు. రాబోయే 2,3 నెలలు సెకండ్‌ ‌వేవ్‌ ‌ప్రభావం ఉంటుందని తెలిపారు. కరొనా వైరస్‌ ‌ముప్పు ఇంకా  తగ్గలేదన్నారు. సీఎం ఆదేశాల మేరకు 7 జిల్లాలు 11 ప్రాంతంలో వైద్య ఆరోగ్య శాఖ తిరిగి చూడటం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో పొలిటికల్‌ ‌యాక్టివిటి ఎక్కువ అయ్యిందని, ఎక్కువ గుంపులు సమూహాలూ లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. రాజకీయ నాయకులు ఎవ్వరు కొరొనా నిబంధనలు పాటించడం లేదని, మాస్క్ ‌పెట్టుకోవడం లేదన్నారు. వైరస్‌ ‌కంట్రోల్‌ ‌చెయడం కోసం లక్ష వరకు టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొవాలని రాజకీయ నాయకులకు విప్తి చేశారు. ఇంకా రెండు సంవత్సరాలు కరొనా వైరస్‌తో పోరాడాల్సి ఉంటుందని తెలిపారు.

Leave a Reply