Take a fresh look at your lifestyle.

‌ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సిఎల్పీ నేత, ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క

మధిర మండలానికి కరోనా వైరస్‌ ‌ప్రమాదం పొంచి ఉన్నదని నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గురువారం స్థానిక మార్కెట్‌యార్డ్, ‌ప్రభుత్వాసుపత్రి, టివిఎం పాఠశాలలో హ్యాండ్‌ ‌వాష్‌, ‌శానిటైజర్లను ఆయన సొంత ఖర్చు లతో ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ మధిర ప్రాంతానికి ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో అక్కడి అధికారులు రెడ్‌జోన్లుగా ప్రకటించారని, నిత్యం సరిహద్దు గ్రామాల నుండి వందలాది మంది మధిర వస్తుంటారని, కాని ఈ సమయంలో ఎవరినీ మధిరకు రానివ్వకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆయనవెంట కాంగ్రెస్‌ ‌పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్‌ ‌ప్లోర్‌ ‌లీడర్‌ ‌మల్లాది వాసు, మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్‌, ‌నాయకులు బా లరాజు, రామారావు పాల్గొన్నారు.

సరుకులు పంపిణీ:
పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో మధిర సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యా వసర సరుకులను స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క అందచేశా రు. సేవా సమతి నిర్వాహకులు పల్లపోతుల ప్రసాదరావు, ఇరుకుళ్ళ లక్ష్మీనర్సింహారావు, చారుగుండ్ల నర్సింహామూర్తి, కపిలవాయి జగ న్మోహన్‌రావు కుంచం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply