Take a fresh look at your lifestyle.

ప్రజలందరూ కొరోనా టీకా వేయించుకోవాలి: రాహుల్‌ ‌గాంధీ ట్వీట్‌

  • మార్గదర్శకాలు పాటించండి
  • కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ ట్వీట్‌

సాధ్యమైనంత త్వరగా కోవిడ్‌-19 ‌టీకాలు తీసుకోవాలని ప్రజలకు కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో, టీకాలు తీసుకున్న తర్వాత భద్రతాపరమైన మార్గదర్శకాలను అన్ని విధాలుగా పాటించాలని కోరారు. అన్‌లాకింగ్‌ ‌జరుగుతున్నదని, అయితే కొరోనా వైరస్‌ ‌మనతోనే ఉంటుందని అన్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో కోవిడ్‌-19 ‌మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు. అందరూ సురక్షితంగా లేకపోతే ఏ ఒక్కరూ క్షేమంగా ఉండలేరని అన్నారు. ప్రజలంతా తమ పట్ల తాము శ్రద్ధ వహించాలని చెప్పారు.

Leave a Reply