‘కరోనా’పై ప్రజల్లో అవగాహన కల్పించాలి: కలెక్టర్ ఎస్ క్రిష్ణ ఆదిత్య
ములుగు: కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. గురు వారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వ్యాధి చికిత్స కంటే, ముందు జాగ్రత్తలతో నియం త్రణ మేలని అన్నారు. జిల్లాలో పర్యాటక ప్రాంతా లకు వచ్చే విదేశి, దూర ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులపై దృష్టి పెట్టాలన్నారు. విదేశాల్లో వుంటూ, స్వస్థలాలకు వచ్చేవారు, విదేశాల్లో బంధువులు ఉన్నవారి వివరాలు సేకరించాల న్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తే, వైరస్‌ను దూరం గా ఉంచొచ్చని ఆయన అన్నారు.
కేవలం జలుబు, దగ్గు ఉన్నవారు మాత్రమే మాస్క్ లు పెట్టుకోవా లని, అందరికి అవసరం లేదని అన్నారు. మన ప్రాంతంలో 20 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నందున, కరోనా వైరస్ మనుగడ సాగించలే దని, ఈ వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వైరస్‌కు రాష్ట్రంలో ప్రభుత్వం 25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింద ని, ఎక్కడైనా అనుమానిత సమాచారం ఇస్తే, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కరోనా వైరస్ ముందు జాగ్రత్తలపై రూపొందించిన కరప త్రాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారిణి కె. రమాదేవి, జెడ్పి సీఈఓ ఏ. పారిజాతం, జిల్లా వైద్యాధికారి ఏ. అప్పయ్య,ఇడి ఎస్సి కార్పొరేషన్ టి. రవి, డిటివో ఎన్.జర్సన్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి:
జనాభా గణన 2021 పురస్కరించుకుని మొదటి దశ ఇండ్ల జాబితా, ఇండ్ల గణనపై జనగణన అధికారులు, చార్జిడ్ అధికారులకు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకొని, గణనలో ఎటువంటి తప్పిదాలు, పొరపాట్లు జరగకుండా విజయవం తంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మంది రంలో గణన, ఛార్జిడ్ అధికారులకు నిర్వహిస్తున్న రెండో రోజు శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గణనపై ప్రతి అధికారికి పూర్తి అవగాహ న ఉండాలని, క్షేత్ర స్థాయిలో సమస్యలొస్తే, వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇంకా కార్యా చరణ తేదీలను ప్రకటించలేదన్నారు.
ఈ సంద ర్భంగా కలెక్టర్, అధికారులకు గణన పై ప్రశ్నల డిగి అవగాహన కల్పించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా గణనకు సంబంధించి చేప ట్టాల్సిన చర్యలు, విధివిధానాలపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ ప్రణాళికాధికారి ఐ. రవి కుమార్, మాస్టర్ ట్రైనర్ రమాదేవి, సెన్సెస్ జిల్లా ఇంచార్జ్ అనిత, తహశీల్దార్లు, ఎంపిడిఓలు, నాయబ్ తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.