Take a fresh look at your lifestyle.

‌ప్రజలు పరిశుభ్రతను పాటించాలి : కలెక్టర్‌

People should adopt hygiene Collector prashanth jeevan patil

‌వరంగల్‌ అర్బన్‌: ‌పచ్చదనం పరిశుభ్రత నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్‌ ‌ప్రశాంత్‌ ‌జీవన్‌ ‌పాటిల్‌ అన్నారు. రెండో విడత పల్లెబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం వేలెరు మండలంలోని ఎర్రబెల్లి, కాన్నారం మద్దెల గూడెంలలో పల్లె ప్రగతిలో చేపట్టిన పనులను జడ్పీ చైర్మన్‌ ‌డాక్టర్‌ ‌సుధీర్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ ప్రజలు గ్రామాల్లో పరిశుభ్రంగా ఉండాలన్నారు. ప్రజల సహకారం ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా వాటిని వినియోగించుకొని గ్రామ అభివృద్ధికి దోహద పడేవిదంగా కృషి చేయాలన్నారు.

ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నెల నెల జనాభా ప్రాతిపదికన నిధులను మంజూరు చేస్తున్నందున వాటిని పారదర్శకంగా ఖర్చు చేసుకోవాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో స్థానిక ప్రజాప్రతినిధులు సహకారంతో అధికారులు గ్రామాల సమూల మార్పులకు కృషి చేయాలన్నారు. గ్రామపంచాయతీలలో డంపింగ్‌ ‌స్మశాన వాటికల నిర్మాణాలు ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మాణాలు పండ్ల మొక్కలు పెంచడం చెత్తను విచ్సల విడిగా ఏక్కడ పడ్తే అక్కడ పడేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉండేందుకు కృషి చేయాలన్నారు. గ్రామ పారిశుధ్య కార్మికులకు రోజువారీగా ఇంటింటికీ చెత్త సేకరణతో పాటుగా మురుగు కాల్వల శుభ్రం నీటి నిలవ గుంతలను పూడ్చడం నీటి నిల్వ ప్రదేశాలలో దోమల నివారణకు చర్యలు చేపట్టి వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Tags: warangal urban, People should, adopt hygiene, Collector prashanth jeevan patil

Leave a Reply